Begin typing your search above and press return to search.
మేనల్లుడి సినిమా అడ్రస్ లేదుగా..
By: Tupaki Desk | 28 Jun 2016 1:30 PM GMTదశాబ్దం దాటిపోయింది అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా అరంగేట్రం చేసి. కానీ ఇప్పటిదాకా కుర్రాడు నిలదొక్కుకోలేదు. సొంత బేనర్లోనే మూడు సినిమాలు చేశాడు కానీ.. అందులో ఒక్కటీ సరైన ఫలితాన్నివ్వలేదు. ‘అడ్డా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘ఆటాడుకుందాం రా’ సినిమా చేశాడు సుశాంత్. ఐతే ఈ సినిమా టీజర్ రిలీజై మూణ్నాలుగు నెలలవుతోంది కానీ.. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఏ అప్ డేట్ లేదు. టీజర్ రిలీజైనపుడు జనాలకు సినిమా మీద కొంచెం ఆసక్తి కలిగింది కానీ.. ఆ తర్వాత దాని గురించి మరిచిపోయారు.
నాగేశ్వరరెడ్డి ‘ఈడో రకం ఆడోరకం’ సినిమాతో హిట్టు కొట్టి మంచి ఊపు మీదున్నాడు.. టీజర్ కూడా పర్వాలేదనిపించుకుంది.. ఈ ఊపులో సాధ్యమైనంత త్వరగా సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేస్తే ఓ పనైపోయేది. సమ్మర్ సీజన్లో వచ్చి ఉంటే సినిమా లాభం కూడా జరిగేది. కానీ కారణమేంటో తెలియదు కానీ.. ఇప్పటిదాకా సినిమా పూర్తి కాలేదు. అన్నీ అందుబాటులో ఉన్నా సినిమా పూర్తి కాలేదు. సమ్మర్ అంతా ఐపీఎల్ మ్యాచ్ లకు వెళ్తూ టైంపాస్ చేశాడు సుశాంత్. ఇప్పుడేమో పల్లెకుపోదాం అంటూ ఏదో పాట తీస్తున్నామంటూ అప్ డేట్ ఇస్తున్నాడు. అసలే సుశాంత్ కు ఉన్న క్రేజ్ అంతంతమాత్రం. ఇక సినిమా ఇలా డిలే అయితే జనాల్లో ఏమాత్రం ఆసక్తి ఉంటుందన్నది సందేహమే. కాబట్టి ఇప్పటికైనా సుశాంత్ అండ్ కో మేల్కొని సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి విడుదలకు సన్నాహాలు చేస్తే బెటర్.