Begin typing your search above and press return to search.
సుశాంత్ ఫ్యాన్స్ డిమాండ్!
By: Tupaki Desk | 18 Jun 2020 12:30 PM GMTడిప్రెషన్.. ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న సుశాంత్ రాజ్ పూత్ విషయం ఇండస్ట్రీలో గత మూడు రోజులుగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే. సుశాంత్ మరణంకు కొందరు కారణం అంటూ వారిని నెటిజన్స్ ట్రోల్స్ చేయడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో సుశాంత్ ఆత్మహత్యకు కారణం అంటూ ఇప్పటికే కొందరిని పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఈ సమయంలో సుశాంత్ చివరి సినిమా విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
సుశాంత్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచరా’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. కాని ప్రస్తుత కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ లో ముకేష్ చబ్రా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్ బేచరా చిత్రంను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని సుశాంత్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు.
సుశాంత్ చివరి చిత్రం అవ్వడం వల్ల దిల్ బేచరా చిత్రంను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలి. కాస్త ఆలస్యం అయినా కూడా వెండి తెరపై సుశాంత్ చివరి సినిమా ప్రదర్శింపబడి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఓటీటీ ద్వారా ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తే మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తామంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా దిల్ బేచరా సినిమా ఓటీటీ విడుదలను బహిష్కరిస్తు పోస్ట్ లు పెడుతున్నారు.