Begin typing your search above and press return to search.
సుశాంత్.. లైఫ్ అండ్ డెత్ పై సినిమా
By: Tupaki Desk | 19 Jun 2020 5:50 AM GMTయంగ్ ట్యాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో కల్లోలం సృష్ఠించిన సంగతి తెలిసిందే. పరిశ్రమలో అంతర్గత రాజకీయాల్ని.. కుట్రలు కుతంత్రాల్ని తెరపైకి తెచ్చిన రేర్ డెత్ మిస్టరీ కేసు ఇది. డిప్రెషన్ తో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించినా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ సాగుతూనే ఉంది. ఈ మరణం వెనక అసలు వాస్తవం ఏమిటి? అన్నదానిపై దర్యాప్తు సాగిస్తున్నారు. ఈలోగానే సోషల్ మీడియాలో బాలీవుడ్ కుతంత్రాలపై ఆసక్తికర డిబేట్ వేడెక్కించింది.
బాలీవుడ్ లో నటవారసత్వం.. గ్రూప్ రాజకీయాలు.. బయటి నుంచి వచ్చేవారి కష్టాలు.. కుట్రలు.. వివక్ష వంటి అంశాలు సోషల మీడియాలో వేడెక్కిస్తున్నాయి. రకరకాల వివాదాలు అగ్గి రాజేస్తున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు బాలీవుడ్ లో ఖాన్ లు.. కపూర్లపై సెటైర్లు వేశారు. సుశాంత్ ఆత్మహత్యకు అతడిపై అగ్ర బ్యానర్లు కుట్ర పన్నడమే కారణమని నిందారోపణలు చేశారు. కరణ్ జోహార్.. అలియా భట్-సల్మాన్ ఖాన్ .. ఇలా ఎవరినీ వదిలి పెట్టలేదు. అయితే ఈ ఆరోపణలపై సైఫ్ ఖాన్.. ఆర్జీవీ వంటి సెలబ్రిటీలు పూర్తి భిన్నమైన వాదన వినిపించారు. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్ సరికొత్త వివాదం హాట్ టాపిక్ గా మారింది.
ఇవన్నీ ఇలా ఉండగానే సైలెంటుగా సుశాంత్ సింగ్ పై బయోపిక్ ని ప్రకటించి హీట్ మరింత పెంచారు ఫిలింమేకర్ విజయ్ శేఖర్ గుప్తా. సుశాంత్ జీవితం మరణం ఆధారంగా `సూసైడ్ ఆర్ మర్డర్?` అనే టైటిల్ తో ఒక సినిమాను ప్రకటించారు. `ఏ స్టార్ వజ్ లాస్ట్` అన్న ట్యాగ్ లైన్ ని ఎంపిక చేశారు. వి.ఎస్.జి బింగే బ్యానర్ లో విజయ్ శేఖర్ గుప్తా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షామిక్ మౌలిక్ దర్శకత్వం వహించనున్నారు. సుశాంత్ మోనోక్రోమ్ లుక్ (ఫస్ట్ లుక్) మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
అజేయంగా కెరీర్ ని సాగించి అంతలోనే అంతర్థానమైన ఒక వర్థమాన నటుడి మరణంపై సినిమా తీయాలనుకోవడం ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన ఉంది. పైగా సుశాంత్ మరణించి ఇంకా దశదిన కర్మ కార్యక్రమం కూడా కాకుండానే సినిమా తీస్తున్నాం అని ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో వివాదాస్పద అంశాలతో ముడిపడిన సినిమా ఇది. అందువల్ల సవ్యంగా తెరకెక్కి రిలీజ్ చేస్తారా లేదా? అన్నది చూడాలి.