Begin typing your search above and press return to search.

సుశాంత్ తన మరణం పట్ల ముందే హింట్ ఇచ్చాడా..?

By:  Tupaki Desk   |   15 Jun 2020 3:32 PM GMT
సుశాంత్ తన మరణం పట్ల ముందే హింట్ ఇచ్చాడా..?
X
మనిషి మానసిక స్థితిని అంచనా వేసే వైద్య నిపుణులకు కూడా ఒక్కోసారి కొన్ని విషయాలు అందవేమో కాబోలు. మనిషి మరో మనిషికి ఎంత సన్నిహితంగా ఉంటే అవతల మనిషి మనసులో భావం తెలుసుకోగలడు.. ఆలోచించండి. వారికి మనం నిజమైన సన్నిహితులుగా ఉంటే మనసులో బాధను పంచుకుంటారు. కానీ ప్రస్తుత డిజిటల్ కాలంలో ఉరుకులు, పరుగుల జీవితంలో అవతల మనిషి పక్కన పెడితే మన గురించి మనం పట్టించుకోవడమే మానేశాం. అలాగే మరి.. పీక్స్ లో ఉన్న తన కెరీర్ గురించి పట్టించుకోవడం మానేసి సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రస్తుతం శోకసంద్రంలో మునిగింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే సూసైడ్ చేసుకున్న హీరో సుశాంత్ ఏం తక్కువ భావించాడు.

లైఫ్ లో అన్నీ ఉన్నాయి కదా.. ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? స్టార్‌గా ఎదుగుతున్న తరుణంలో లోటేముంది?అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్నాయి. అయితే సుశాంత్ తన మరణం గురించి ముందే హింట్ ఇచ్చాడా.. అంటే అతడి ఫాలోయర్స్ కి ఈ విషయం తెలిసి ఉంటుందని అంటున్నారు. తనను ‘డిప్రెషన్‌’తో బాధ పడుతున్నట్లు ట్విటర్‌ కవర్ ఫోటో ద్వారా హింట్ ఇచ్చాడా అంటే నిజమే అనిపిస్తుందని అంటున్నారు. 1889లో విన్సెంట్‌ వాన్‌ గోగ్‌ చిత్రించిన ‘స్టారీ నైట్స్‌’ పెయింటింగ్‌ ద్వారా తన డిప్రెషన్ని బయట పెట్టాడట. విన్సెంట్‌ గోగ్‌ డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నపుడే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆ తర్వాత 1890లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. అయితే అదే కవర్ ఫోటో పెట్టి సూసైడ్ గురించి ముందే చెప్పాడని భావిస్తున్నారు.

అయితే కొన్నాళ్లుగా ట్విటర్‌కు దూరమైన సుశాంత్‌.. ‘‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరి అవుతోంది. అంతు లేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’’ అంటూ జూన్‌ 3న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. తనకు శాశ్వతంగా దూరమైన కన్నతల్లిని తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. పదిరోజులు తిరగకుండానే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మంచి చదువు.. స్టడీలో టాప్ స్టూడెంట్.. అన్నీ ఉన్నా సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. స్టార్ గా ఎదిగాక ఒక్కసారి ఉరి వేసుకొని కుప్పకూలిపోయాడు. అయితే తన మరణం గురించి ఆ ఫోటోతో సూచించాడని పలువురు మాట్లాడుతున్నారు.