Begin typing your search above and press return to search.

సుశాంత్ ఎట్ట‌కేల‌కు దారికొచ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   30 Jan 2020 6:44 AM GMT
సుశాంత్ ఎట్ట‌కేల‌కు దారికొచ్చిన‌ట్టేనా?
X
సుశాంత్ ఎట్ట‌కేల‌కు దారికొచ్చిన‌ట్టేనా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. అక్కినేని కాంపౌండ్ హీరో అయినా ఇన్నాళ్లు కెరీర్ ప‌రంగా కొంత స్థ‌బ్ధ‌త కొన‌సాగింది. ఇటీవ‌లే రిలీజైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో అత‌డికి లైన్ క్లియ‌ర్ చేసింద‌నే టాక్ మొద‌లైంది. ఈ చిత్రంలో స‌రైన పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. న‌టించేందుకు స్కోప్ ఉన్న‌ప్పుడ‌ల్లా మెరిపించాడ‌న్న టాక్ వ‌చ్చింది. మొత్తానికి బ‌న్ని- త్రివిక్ర‌మ్ ఇచ్చిన బూస్ట్ సుశాంత్ కి ప్ల‌స్ అవుతోంద‌ట‌.

సంక్రాంతి పందెంలో అల బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం కేవ‌లం బ‌న్నీ- త్రివిక్ర‌మ్ ల‌కే కాదు ఇందులో న‌టించిన ఇత‌ర న‌టీన‌టుల‌కు క‌లిసి వ‌స్తోందన్న‌ది తాజా అప్ డేట్. ముఖ్యంగా సుశాంత్ వెంట‌నే సోలో హీరోగా మ‌రో సినిమాని ప్రారంభించేశాడు. అల‌.. సక్సెస్ వ‌ల్ల‌నే ఈ ఆఫ‌ర్ రాక‌ పోయినా.. ఆ హిట్టు ఇప్పుడు ముహూర్తం చేసేందుకు బూస్ట్ ఇచ్చింద‌ని అర్థ‌మ‌వుతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ దెబ్బ‌కు వ‌రుస‌గా ఇక‌పై బ‌య‌టి నుంచి ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ట‌.

కెరీర్ ప‌రంగా ఎంత మెలో డ్రామా న‌డిచినా.. అంతా మ‌న మంచికే అనుకుంటేనే అన్నిర‌కాలుగా క‌లిసొస్తుంది. ఎడ‌తెగ‌ని ప్ర‌య‌త్నం ప‌ట్టు విడుపు ఉంటే తిరిగి ఆశించిన కెరీర్ వెతుక్కుంటూ వచ్చిన సంద‌ర్భాలు మ‌న స్టార్లకు అనుభ‌వ‌మే. ఎట్ట‌కేల‌కు ఆ మంచి రోజులు సుశాంత్ కి వ‌చ్చిన‌ట్టే. ఇక‌పై అయినా కెరీర్ ని కాపాడుకుంటూ దానిపైనే పూర్తి శ్ర‌ద్ధ పెడితే స‌రిపోతుంది. నేడు ప్రారంభ‌మైన సినిమా టైటిల్ బాగానే ఉంది. `ఇచ్చ‌ట వాహ‌నాలు నిలుప‌రాదు` అన్న టైటిల్ ఆక‌ట్టుకుంది. ఇక ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ప్రీలుక్ రిలీజ్ చేసిన‌ప్పుడు దానికి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది.

ఇక సుశాంత్ వ్య‌క్తిగ‌త సంగ‌తులు ప‌రిశీలిస్తే.. అనుమోలు సుశాంత్ .. అక్కినేని నాగేశ్వరరావు మనుమడిగా... అక్కినేని నాగార్జున కు మేనల్లుడిగా సుప‌రిచితం. అనుమోలు సత్య భూషణరావు - అక్కినేని నాగసుశీల దంప‌తుల వారసుడు. యార్లగడ్డ సుమంత్ .. అక్కినేని నాగ చైతన్య .. అక్కినేని అఖిల్ ల‌కు ఎంతో క్లోజ్ బ‌డ్డీ. సుశాంత్ తండ్రి తరపున తాతయ్య అయిన ఎ.వి.సుబ్బారావు కూడా చిత్రపరిశ్రమకు చెందినవారు. ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సుమారు 25 చిత్రాల్ని నిర్మించారు. 1970 నుండి 1980 వరకు ఆయ‌న‌ నిర్మాతగా కొన‌సాగారు.