Begin typing your search above and press return to search.

సమంత-చైతన్య నిశ్చితార్థంతోనే మరో లైఫ్

By:  Tupaki Desk   |   29 July 2018 7:22 AM GMT
సమంత-చైతన్య నిశ్చితార్థంతోనే మరో లైఫ్
X
పెద్ద బ్యాక్ గ్రౌండ్.. పైగా అక్కినేని ఫ్యామిలీ హీరో.. కానీ ఎందుకో సుశాంత్ కు కలిసి రాలేదు. నాగార్జున మేనల్లుడిగా టాలీవుడ్ లోకి పదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ ఇప్పటివరకూ ఒక్క గ్రాండ్ హిట్ దక్కలేదు. స్వయంగా అక్కినేని ప్రొడక్షన్ పై తీసిన సినిమాలు కూడా నిరాశపరిచాయి.

దీంతో చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ తన బావ అయిన అక్కినేని నాగచైతన్య-సమంతల నిశ్చితార్థం సుశాంత్ కు కొత్త ఊపిరి పోసింది. ఆ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటనే మళ్లీ సుశాంత్ ను సినిమా తీసేలా మార్చింది.

సమంత-నాగచైతన్య నిశ్చితార్థంలో హీరో సుశాంత్ - నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒకే టేబుల్ దగ్గర కూర్చుకున్నారట.. ఆ సందర్భంలోనే తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నానో.. తన అభిరుచులు ఏమిటో అతడికి చెప్పాడట సుశాంత్. ఆ తర్వాత కొద్దిరోజులకే రాహుల్ వచ్చి ‘చి.ల.సౌ’ కథను చెప్పాడట.. కథ బాగుండడం.. మనసుకు నచ్చడంతో స్వీయ నిర్మాణంలో సుశాంత్ ఈ సినిమా తీశాడు. దీన్ని సమంతకు చూపిస్తే చాలా మెచ్చుకుందట.. నాగచైతన్యకు కూడా నచ్చడంతో తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చి.ల.సౌ’ సినిమా టీజర్లు - ట్రైలర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇలా నాగచైతన్య-సమంత నిశ్చితార్థం తనకు మళ్లీ హీరోగా చేసే చాన్స్ ను ఇచ్చిందని సుశాంత్ చెప్పుకొచ్చాడు.