Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ నాదే!!

By:  Tupaki Desk   |   22 May 2017 12:26 PM IST
ఆ హీరోయిన్ నాదే!!
X
ఫిలిం ఇండస్ట్రీలో బోలెడన్ని లవ్ స్టోరీస్ నడుస్తుంటాయి. నిజమైన లవ్ స్టోరీల కంటే సినిమా ప్రచారాల కోసం పుట్టించే కథలు కూడా ఇంకా ఎక్కువే ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రం నిజమైన ప్రేమకథో.. సినిమా అల్లిన కట్టుకథో అర్ధం కాదు.

ఎంఎస్ ధోనీ మూవీలో నటించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. మహేష్ 1 నేనొక్కడితో పరిచయమైన కృతి సనోన్ ల కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొదట రాబ్తా సినిమా కోసం మొదలైన ప్రేమకథ అనిపించింది. రాన్రాను వీరి లవ్ స్టోరీ ముదిరి పాకాన పడి.. కలిసి చక్కర్లు కొట్టే వరకూ వచ్చింది. ఆ మధ్య ఓ సుశాంత్ ఓ కాస్ట్లీ కార్ కొంటే.. మొదటగా అందులో కృతి సనోన్ తోనే చక్కర్లు కొట్టాడు. అలాంటి వీరిద్దరూ తరచుగా కయ్యాలు ఆడుకుంటూ ఉంటారు. చిన్న గొడవ రాగానే విడిపోయారంటూ మీడియాలో కథనాలు వండి వడ్డించేస్తున్నారు. ఇలాంటివి ఎన్ని రాసినా కృతి సనోన్ మాత్రం నాదే అంటూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు.

హీరోయిన్ నాదే అనేశాడంటే.. లవ్ స్టోరీ గురించి దాదాపుగా డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసినట్లే. నిన్న హైద్రాబాద్ లో జరిగిన ముంబై-పూనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేశారు. ధోనీ బ్యాటింగ్ కి వచ్చినపుడు హంగామా మామూలుగా లేదు. ఈ మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగిందో.. మధ్యమధ్యలో కెమేరా వీళ్లవైపు తిరిగినపుడు.. వీళ్ల కెమిస్ట్రీ కూడా అంతగానే ఆకట్టుకుంది.