Begin typing your search above and press return to search.

పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   15 Oct 2020 11:30 PM GMT
పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చేశారు
X
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్‌ పెళ్లి చేసుకోకుండానే పిల్లలను దత్తత తీసుకుని అమ్మ అయ్యింది. పెళ్లి అవసరం లేదని కొన్ని సంవత్సరాల వరకు అనుకున్న ఆమె తనకంటూ ఒక భాగస్వామి కావాలని భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే మనసుకు నచ్చిన డిజైనర్‌ రోషన్‌ షా తో కొన్నాళ్లుగా రిలేషన్‌ లో ఉంది. ఆమె పిల్లలతో కూడా రోషన్‌ కలిసి పోయాడు. గత రెండు సంవత్సరాలుగా రోషన్‌ గురించి రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ఆయన గురించి ఆయన పిల్లలతో గడిపే క్షణాల గురించి షేర్‌ చేస్తూ వచ్చింది. వయసులో తనకంటే రోషన్‌ చిన్న వాడు అయినా కూడా అతడి పట్ల సుష్మితా సేన్‌ ఎంతో ప్రేమను కనబర్చుతున్నట్లుగా ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌ లను చూస్తే అర్థం అవుతుంది.

ఇన్నాళ్లు వారి రిలేషన్‌ షిప్‌ విషయంలో జనాలు వారి ప్రవర్తన మరియు ఇతరత్ర విషయాల వల్ల ఊహించుకుంటూ వచ్చారు. కాని వారు మాత్రం నోరు తెరిచి రిలేషన్‌ షిప్‌ గురించి చెప్పలేదు. కాని తాజాగా ఇన్‌ స్టాగ్రామ్‌ వీడియోలో సుష్మిత సేన్‌ మరియు రోషన్‌ లు క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు కలిసి లైవ్‌ చేసిన సమయంలో పెళ్లి ఎప్పుడు అంటూ ఒక నెటిజన్‌ అడిగిన సమయంలో సుష్మిత నవ్వి ఊరుకోగా రోషన్‌ మాత్రం త్వరలోనే అన్నాడు. ఇంట్లో వారిని బయటి వారిని సంప్రదించిన తర్వాత పెళ్లి విషయమై ఒక నిర్ణయానికి వస్తామని పెళ్లి తేదీ విషయంలో అందరి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరలోనే నిర్ణయానికి వస్తానంటూ రోషన్‌ చెప్పడంతో వీరిద్దరు త్వరలోనే అధికారికంగా పెళ్లి చేసుకుని తమ బంధంను మరింత బలంగా మార్చుకోబోతున్నారు. చాలా కాలంగా వీరిద్దరు సహజీవనంలోనే ఉన్నారు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుని భార్య భర్తలు అవుతారేమో చూడాలి.