Begin typing your search above and press return to search.
నాటి పోటీలో ఐష్ ఎందుకు ఓడింది?
By: Tupaki Desk | 20 Dec 2016 7:30 PM GMTఅది 1994వ సంవత్సరం జనవరి 16.. గోవాలో మిస్ ఇండియా పోటీలు జరుగుతున్న సమయం అది. మిస్ ఇండియాని ఎంపిక చేయడంలో జడ్జ్ లకు కూడా సంకట పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లాస్ట్ రౌండ్ లో కూడా ఫలితం తేలలేదు. చివరకు సుశ్మితా సేన్ మిస్ ఇండియాగా ఎంపిక కాగా.. ఐశ్వర్య ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది.
ఆ తర్వాత సుస్మిత మిస్ యూనివర్స్ పోటీల్లోనూ.. ఐశ్వర్య మిస్ వరల్డ్ పోటీల్లోనూ నెగ్గి.. రెండు కిరీటాలను ఇండియాకు తీసుకొచ్చేశారు కానీ.. సుశ్మితా సేన్ తో పోటీలో.. ఐశ్వర్యారాయ్ ఓడిన మాట వాస్తవమే. చివరి రౌండ్ పూర్తయ్యే సరికి వీరిద్దరికి 9.33 పాయింట్లు రావడంతో టై బ్రేకర్ గా ఓప్రశ్న వేయాల్సి వచ్చిందని.. అప్పటి టాప్10 ఫైనలిస్ట్ మెహ్రూ మిస్త్రీ బయటపెట్టింది.
టై బ్రేకర్ లో 'నీ భర్తలో క్వాలిటీస్ ను ఎంచుకోవాలంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లోని రిడ్జ్ ఫారెస్టర్ ని ఎంచుకుంటారా లేక శాంటా బార్బరాలోని మాసన్ క్యాప్ వెల్ ని ఎంచుకుంటారా' అనే ప్రశ్న ఐశ్వర్యకు ఎదురైంది. 'ఇద్దరి లోనూ కామన్ క్వాలిటీస్ చాలానే ఉన్నా మాసన్ లో బాధ్యతాయుతమైన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఎక్కువ. ఈ కేరక్టర్ నాకు బాగా దగ్గరవుతుంది' అని చెప్పిందట ఐశ్వర్య.
అదే మాదిరిగా టై బ్రేకర్ ప్రశ్నగా సుశ్మితా సేన్ ను'టెక్స్ టైల్ వారసత్వం గురించి మన దేశంలో నీకేం తెలుసు, దాని వయసు ఎంత' అనే ప్రశ్న ఎదురైంది. 'నా ఉద్దేశ్యం ప్రకారం మహాత్మాగాంధీ ఖాదీతో ఇది మొదలైంది . దీనికి చాలానే చరిత్ర ఉన్నా మహాత్మా గాంధీ ప్రారంభించిన మూవ్మెంట్ తోనే ఇది వారసత్వంగా పరిణమించింది' అని చెప్పిందట సుశ్మితా సేన్. అలా ఐశ్వర్యారాయ్ ను ఫస్ట్ రన్నరప్ కు పరిమితం చేసి మిస్ ఇండియా కిరీటాన్ని ఎగరేసుకుపోయింది సుశ్మితా సేన్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/