Begin typing your search above and press return to search.

గురుడి ప్రేమపై సుస్మిత సేన్ రియాక్షన్

By:  Tupaki Desk   |   15 July 2022 3:30 PM GMT
గురుడి ప్రేమపై సుస్మిత సేన్ రియాక్షన్
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు పెట్టినప్పుడు చైర్మన్ గా లలిత్ మోడీకి భారీ స్థాయిలో క్రేజ్ అందిన విషయం తెలిసిందే. ఐపీఎల్ హవ కొనసాగినన్ని రోజులు కూడా లలిత్ మోడీ భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకున్నాడు. అయితే అందులోనే అతను ఆర్థిక నేరారోపణలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా బెట్టింగ్స్ కూడా జరిగాయి అని లలిత్ మోడీ క్రికెట్ ఆటను మొత్తం బ్రష్టు పట్టించినట్లుగా అనేకమంది ప్రముఖులు కూడా అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఐపీఎల్ నుంచి అతను పూర్తిగా తప్పుకున్న అనంతరం అతనిపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లలిత్ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు.

అయితే రీసెంట్ గా అతను ప్రముఖ మాజీ హీరోయిన్ సుస్మితసేన్ తో ప్రేమలో ఉన్నట్లుగా వివరణ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వ్యాపారవేత్తగా కూడా లలిత మోడీ ప్రస్తుతం భారీ స్థాయిలోనే ఆదాయాన్ని అందుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే అతను సుస్మిత సేన్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా వివరణ ఇచ్చాడు. అయితే ఇంతవరకు కేవలం లలిత్ మోడీ మాత్రమే ఆ విషయంలో క్లారిటీ ఇవ్వగా ఆ న్యూస్ అంతగా వైరల్ కాలేదు. ఇక ఎప్పుడైతే సుస్మిత సేన్ కు కూడా క్లారిటీ ఇవ్వడం స్టార్ట్ చేసిందో వీరి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు ట్రెండింగ్ లిస్టులో చేరిపోతున్నాయి.

సుస్మితాసేన్ తన సోషల్ మీడియా ఖాతాలో తన ప్రేమ గురించి కాస్త ఇన్ డైరెక్ట్ గా వివరణ ఇచ్చింది. ' ఐ వాంట్‌ యు టూ నో.. యూ ఆర్‌ ద లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌' అనే ఇంగ్లిష్‌ పాటలు కు సంబంధించిన లిరిక్స్ పోస్ట్ చేసి అమ్మడు తన ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచినట్లు తెలియజేస్తోంది.

ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా మాల్దీవ్స్ లో రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లండన్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి ఫోటోలతో సర్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.