Begin typing your search above and press return to search.

బంధంలో న‌మ్మ‌కం ఉండాలి అన్న‌ది నా స‌ల‌హా!- సుస్మితాసేన్

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:30 PM GMT
బంధంలో న‌మ్మ‌కం ఉండాలి అన్న‌ది నా స‌ల‌హా!- సుస్మితాసేన్
X
బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ రోహ్మాన్ తో మూడేళ్ల‌గా డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రోహ్మాన్ -సుస్మిత క‌న్నా 15 ఏళ్లు చిన్న‌వాడు. అయినా ఒక‌రంటే ఒక‌రు ఇష్ట‌ప‌డ‌టంతో ఇద్ద‌రు స‌హ‌జీవనం చేసారు. సుస్మితా ద‌త్త పుత్రిక‌లు రినీ..అలీషాతో కూడా రోహ్మ‌న్ ఓ ఫ్యామిలీ లా క‌లిసిపోయేవాడు. అయితే ఇప్పుడా బంధానికి పుల్ స్టాప్ ప‌డింది. మూడేళ్ల ప్రేమ‌కి సుస్మితా సేన్ బ్రేక‌ప్ చెప్పేసింది. ఈ బ్రేక‌ప్ వార్త‌ని సుస్మిత ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.

``మేము స్నేహితులుగా క‌లిసాం. ఇక మందు కూడా స్నేహితులుగానే ఉంటాం. మా మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఇక ఉండ‌దు అని కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది. అయితే త‌మ మ‌ధ్య ఉన్న ల‌వ్ మాత్రం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ని తెలిపింది. ఇంత‌కు మించి ఎవ‌రూ ఎక్కువ‌గా ఊహించుకోవ‌ద్దు. జీవితంలో వ్య‌క్తుల‌తో గ‌డ‌ప‌డాన్ని ఆస్వాదిస్తాను. ప్రేమిస్తాను. కానీ ఆ బంధంలో న‌మ్మ‌కం ఉండాలి అన్న‌ది నా స‌ల‌హా అంటూ ప్రియుడిపై కౌంట‌ర్ వేసింది. అయినా `ఐల‌వ్ యూ గ‌య్స్` అంటూ మాజీలు అంద‌ర్నీ మ‌రోసారి గుర్తు చేసుకుంది.

ఇక సుస్మిత సేన్ కి ఇలాంటి బ్రేక‌ప్ లు కొత్తేం కాదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి బ్రేక‌ప్ లు చాలా మందికి చెప్పింది. సుస్మిత సేన్ తొలిసారి ముంబైకి చెందిన ఓ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్ తో ల‌వ్ లో ప‌డింది. వాళ్లిద్ద‌రు 2017లో విడిపోయారు. ఆ త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌దీప్ హుడా.. బంటి స‌జ్ద్ హ్ తో ..ద‌ర్శ‌కులు విక్ర‌మ్ భ‌ట్..ముద‌స్స‌ర్ అజీజ్ తో సంజ‌య్ నారంగ్ తో.. స‌బీర్ భాటియాతో.. పాక్ క్రికెట‌ర్ వ‌సీం అక్ర‌మ్ తో డేటింగ్ చేసింది. వాళ్లంద‌రితోనూ కొన్నాళ్ల పాటే బాండింగ్ కొన‌స‌గించింది. అయితే ప్రేమికురాలిగా సుదీర్ఘ అనుభ‌వం పొందిన నేప‌థ్యంలో రోహ్మాన్ షా ని వివాహం చేసుకుంటుంద‌ని చాలా మంది అనుకున్నారు. కానీ రోహ్మాన్ కూడా మాజీ ప్రియుడాయే. సుస్మితా సేన్ వెబ్ సిరీస్ ల‌తో బిజీ గా ఉన్న సంగ‌తి తెలిసిందే.