Begin typing your search above and press return to search.

విశ్వం నీలో ఒదిగెను సుంద‌రీ

By:  Tupaki Desk   |   3 April 2020 10:10 AM GMT
విశ్వం నీలో ఒదిగెను సుంద‌రీ
X
విశ్వ‌సుంద‌రి.. నిత్య బ్ర‌హ్మ‌చారిణి సుశ్మితా సేన్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సుష్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్ప‌టికే విశ్వ‌సుంద‌రి కిరీటం ద‌క్కించుకుని పాతికేళ్ల‌య్యింది. పెళ్లాడ‌క‌పోయినా ప‌లువురు క‌థానాయకులతో ఎఫైర్లు సాగించింద‌న్న ప్ర‌చారం అయితే ఉంది. ఇక ఇటీవ‌లి కాలంలో తాను వ‌ల‌చిన టాప్ మోడ‌ల్ రోహ‌మ‌న్ షాల్ తో స‌హ‌జీవ‌నం చేయ‌డంపైనా మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. గ‌త ఏడాది చివ‌రిలో ఈ జంట పెళ్లితో ఒక‌ట‌వుతుంద‌ని ప్ర‌చారం సాగినా అదేదీ నిజం కాలేదు.

ఇక సుష్ ప‌లువురు అనాధ‌ పిల్ల‌ల్ని ద‌త్తత తీసుకుని పెంచి పోషిస్తున్న గొప్ప మాతృమూర్తిగా పాపులారిటీ ద‌క్కించుకుంది. సామాజిక సేవ‌లోనూ సుష్ మంచి మ‌న‌సు ఆల్వేస్ హాట్ టాపిక్. ఇక నాలుగు ప‌దుల వ‌య‌సులో మోడ‌ల్ రోహ‌మ‌న్ తో ప్రేమాయ‌ణం నిరంత‌రం హాట్ టాపిక్కే. అయితే ఇటీవ‌లి కాలంలో రోహ‌మ‌న్ తో ఉన్న ఫోటోల్ని త‌క్కువ‌గానే సుష్ షేర్ చేస్తోంది. అప్పుడ‌ప్పుడు వేడెక్కించే ఫోటోషూట్ల‌ను మాత్రం సోష‌ల్ మీడియాల‌లో పోస్ట్ చేస్తోంది.

తాజాగా ఈ మాజీ విశ్వ‌సుంద‌రి అదిరిపోయే ఫోటోషూట్ తో ట‌చ్ లోకి వ‌చ్చింది. షిమ్మ‌రీ మెరూన్ గౌన్ లో సుష్ లుక్ అదిరిపోయింద‌నే చెప్పాలి. లేటు వ‌య‌సు ఘాటు అందాల్ని ఓ రేంజులోనే ఎలివేట్ చేసింది ఈ గౌన్. ఆ బ్యాక్ గ్రౌండ్ లో స‌ర్కిల్ ఇంట్రెస్టింగ్ గా ఆక‌ర్ష‌ణీయంగా ఫోటోషాప్ చేయ‌డం హైలైట్. ``స‌ర్కిల్ ఆఫ్ లైఫ్‌.. యువ‌ర్స్ ట్రూలీ గెట్స్ క్రియేటివ్! ఐ లవ్ యు గ‌య్స్`` అంటూ ఎగ్జ‌యిట్ మెంట్ ని ఈ సంద‌ర్భంగా సుష్ ప్ర‌ద‌ర్శించింది. ఇటీవ‌లి కాలంలో న‌ట‌న‌కు దూరంగా ఉన్న సుష్ ప‌లు ఫ్యాష‌న్ ఈవెంట్ల‌తో బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉంది. ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌కు యువ‌త‌రాన్ని ప్రిపేర్ చేయ‌డం వృత్తిలో భాగం. త‌న వృత్తిగ‌త వ్య‌వ‌హారాల్లోనే రోహ‌మ‌న్ తో ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌కు దారి తీసింది. అది ఓపెన్ గానే ఆ ఇద్ద‌రూ అంగీక‌రించినా పెళ్లి అన్న ఆలోచ‌న చేయ‌క‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్య‌ ప‌రుస్తోంది.

సుశ్మితాసేన్(44) కుటుంబ నేపథ్యం ప‌రిశీలిస్తే.. 19 న‌వంబ‌ర్ 1975లో హైద‌రాబాద్ కి చెందిన ఓ బెంగాళీ బైద్య ఫ్యామిలీలో జ‌న్మించారు. తండ్రి షుబీర్ సేన్ ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వింగ్ క‌మాండ‌ర్. త‌ల్లి శుభ్ర సేన్ జువెల‌రీ డిజైన‌ర్. సొంతంగా దుబాయ్ లో ఓ జువెల‌రీ షోరూమ్ ని నిర్వ‌హించేవారు. సుష్ కి నీల‌మ్- రాజీవ్ అనే ఇద్ద‌రు సోద‌రులు ఉన్నారు. విశ్వ‌ సుంద‌రిగా కిరీటం గెలుచుకున్న సుశ్మితాసేన్ అనంత‌ర కాలంలో టాప్ మోడ‌ల్ గా.. బాలీవుడ్ క‌థానాయిక‌గా కెరీర్ ని సాగించింది. టాలీవుడ్ లో నాగార్జున స‌ర‌స‌న `ర‌క్ష‌కుడు` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అగ్ర క‌థానాయిక‌గా వెలిగిపోక‌పోయినా త‌న‌కంటూ ఓ రేంజ్ ఉంద‌ని సుష్ నిరూపించింది.