Begin typing your search above and press return to search.
విశ్వసుందరిని ఇవ్వలేని అందగత్తె!
By: Tupaki Desk | 26 Aug 2018 1:30 AM GMTముంబైలో ప్రతియేటా లాక్ మే ఫ్యాషన్ వీక్ సందడి ఆషామాషీగా ఉండదు. ఇక్కడ నవతరం మోడల్స్ .. భవిష్యత్ విశ్వసుందరులు కొలువుదీరే చోటు. ఫ్యాషన్ రాణులంతా ఈచోట రచ్చ రచ్చ చేస్తారు. అందుకే ఈ వీక్‌కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి యేటా మాజీ విశ్వసుందరి సుశ్మితాసేన్ తీర్చిదిద్దిన అందగత్తెలు ఇక్కడ ప్రదర్శన ఇస్తుంటారు. వీళ్లలో చాలామంది ఇండియాస్ బెస్ట్ మోడల్స్‌గా ఎదిగారు.
అయితే తాను విశ్వసుందరి అయ్యాక.. చాలా కాలానికి కానీ వేరొక భామ విశ్వసుందరి కిరీటం నెగ్గకపోవడం అన్నది ఫ్యాషన్ ప్రియుల్లో చాలాకాలంగా చర్చకొస్తూనే ఉంది. ఒక్క ఐశ్వర్యారాయ్ - సారా జేన్ డయాస్ లాంటి వాళ్లు అందాల పోటీల్లో వచ్చినా సుష్ తయారు చేసిన భామలెవరూ విశ్వయవనికపై రాణించలేదన్న విమర్శలు ఉన్నాయి. అదంతా అటుంచితే ఐష్ - సుష్ టైమ్ తో పోలిస్తే అందాల పోటీల్లో వరల్డ్ వైడ్ కాంపిటీషన్ పెరగడం ఈ వెనకబాటుకు కారణం కావొచ్చు.
ఎందరో టాప్ మోడల్స్ కి ట్రైనింగ్ ఇచ్చిన సుశ్మితా సేన్ ఇప్పటివరకూ ఒక్క విశ్వసుందరిని అయినా ట్రైనప్ చేయలేకపోయిందే అన్న పెదవి విరుపులు .. వెక్కిరింతలు ఉన్నాయి. నిన్నగాక మొన్న మానుషి చిల్లర్ విశ్వసుందరి 2017గా నిలిచింది. తనో హర్యానా అమ్మాయి. సుశ్మిత సారథ్యంలోని ముంబై భామలెవరూ ఆ స్థాయిని అందుకోలేకపోయారన్నది ఓ విమర్శ. లేటెస్టుగా ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్‌వీక్‌లో సుశ్మిత సంధించిన శరాలెన్నో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నాయి. సుశ్మిత ఫ్యాషన్ కాలేజీల నుంచి వచ్చిన శిష్యులు ఇక్కడ సందడి చేశారు. చూద్దాం.. మునుముందు ఇండియాకి ప్రపంచ సుందరీమణుల వెల్లువ పెరుగుతుందేమో. సుష్ ట్రైనింగ్ వర్కవుటవుతుందేమో?