Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడితో కలిసి ప్రివ్యూ షోకు సుస్మితా సేన్

By:  Tupaki Desk   |   12 Aug 2022 4:15 AM GMT
మాజీ ప్రియుడితో కలిసి ప్రివ్యూ షోకు సుస్మితా సేన్
X
అనూహ్యమైన పరిణామాలతో వార్తల్లోకి వచ్చే సెలబ్రిటీలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నారు. ఆ కోవలోకే వస్తారు మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్.

ఉరుము.. పిడుగు లేకుండా ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ అంటూ ఐపీఎల్ మాజీ సారధి లలిత్ మోదీతో ఉన్న రిలేషన్ గురించి రివీల్ చేసి అందరికి షాకిచ్చిన సుస్మిత.. అప్పటినుంచి ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటివరకు తాజా బాయ్ ఫ్రెండ్ తో చిల్ అవుట్ అయిన ఆమె.. రీసెంట్ గా ఇండియాకు రావటం తెలిసిందే.

తన తల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని చేసిన వీడియోలో.. ఆ ఫ్రేమ్ లోకి అనుకోకుండా సుస్మిత మాజీ బాయ్ ఫ్రెండ్ కమ్ మోడల్ రోహ్మన్ షావల్ కనిపించటం తెలిసిందే. తన కంటే దాదాపు పద్నాలుగేళ్ల చిన్నోడైన రోహ్మన్ తో కొన్నేళ్లు కలిసి ఉన్న వారు.. కారణం ఏమైనా విడిపోవటం తెలిసిందే.

కట్ చేస్తే.. తన కంటే దాదాపు 11 ఏళ్లు పెద్దవాడైన లలిత్ మోడీతో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న సుస్మిత.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఆమె అమీర్ ఖాన్.. నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా ప్రివ్యూకు హాజరయ్యారు.

ప్రివ్యూకు హాజరైతే కూడా వార్తా? అన్న క్వశ్చన్ వద్దు. ఎందుకంటే.. ఈ ప్రివ్యూ షోకు సైతం తన తల్లి.. పెంపుడు కుమార్తెలతో పాటు మాజీ బాయ్ ఫ్రెండ్ తో రావటం అందరిని ఆకర్షించింది.

మొన్నటి ఇంట్లో తల్లి బర్త్ డే సందర్భంగా.. తాజాగా ప్రివ్యూ షోకు ఫ్యామిలీతో పాటు మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చిన వైనం చూసినప్పుడు.. ఇదో సిత్రంగా మారింది. మిగిలిన వారి మాదిరి కాకుండా కటీఫ్ అయ్యాక కూడా టచ్ లో ఉన్నారన్న విషయం వరుస పెట్టి రివీల్ అవుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది.