Begin typing your search above and press return to search.
ప్రియుడితో ఏజ్ బార్ బ్యూటీ ఘాటు రొమాన్స్
By: Tupaki Desk | 2 April 2020 1:00 PM GMTకరోనా మహమ్మారి రోజు రోజుకి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగుతోంది. కరోనా భయంతో మన దేశంలో కూడా లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సామాన్యులు నానా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ పనులను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఖాళీగా ఉన్న మన స్టార్ హీరోయిన్లు తమ అభిమానుల కోసం వర్క్ అవుట్ వీడియోస్, ఫోటోస్ ను తమ సోషల్ మీడియా పేజ్‌లలో పోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఏజ్ బార్ బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ కూడా తన వర్క్ అవుట్ ఫోటోస్‌ను అభిమానులతో పంచుకుంది.
అయితే అందరిలా రొటీన్ వర్క్ అవుట్ ఫోటోస్ కాకుండా కాస్త రోమాంటిక్‌గా ప్లాన్ చేసింది ఈ భామ. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసిన వర్క్ అవుట్ ఫోటోస్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సుష్మితా సేన్ తన ప్రియుడితో కలిసి కపుల్ యోగా చేస్తున్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సుష్మిత షేర్ చేసిన వీడియోలో బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కలిసి చాలా శ్రద్ధగా వివిధ భంగిమల్లో యోగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. 44 ఏళ్ల సుష్మితా సేన్ కి 28 ఏళ్ల తన ప్రియుడు రోహ్మాన్ షాల్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. అక్కడితో ఆగకుండా 'కష్టకాలం ఎప్పటికీ ఉండదు. ఈ సమయంలో బలంగా ఉన్నవారే ఈ విపత్తును దాటగలరు' అంటూ తనదైన వేదాంతాన్ని చెప్పింది. 'ఈ సమయంలో ప్రజలందనూ మానసికంగా శారీరకంగా ధృడంగా తయారు కావాలంటూ' పిలుపునిచ్చింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ లేటు వయసు భామ ఘాటు రిలేషన్‌కు కుర్రాడు కరెక్ట్‌గా సూట్ అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.