Begin typing your search above and press return to search.
సూర్య వెర్సస్ భరత్.. అదే దోబూచులాట
By: Tupaki Desk | 24 Jan 2018 8:40 AM GMTఏప్రిల్ సినిమాల విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. నా పేరు సూర్య.. భరత్ అను నేను.. 2.0.. ఈ మూడు సినిమాల్లో ఏది పక్కాగా ఎప్పుడొస్తుందో తెలియని సందిగ్ధత నెలకొంది. ఈ మూడు సినిమాల విషయంలో ఒక్కోసారి ఒక్కో రకమైన వార్తలొస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ముందుగా ఏప్రిల్ 27 కోసం ‘నా పేరు సూర్య’ బెర్తు బుక్ చేయడం.. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా ‘భరత్ అను నేను’ కూడా అదే తేదీకి షెడ్యూల్ కావడం.. దీనిపై వివాదం రేగడం తెలిసిన సంగతే. అంతలోనే ‘2.0’ కూడా ఏప్రిల్ 27కే ఫిక్సయినట్లు వార్తలొచ్చాయి. దీంతో ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ సినిమాల నిర్మాతల్లో కలవరం మొదలైంది.
మధ్యలో చర్చలు జరిగాయి. రకరకాల స్టేట్మెంట్లు వచ్చాయి. ఆ సినిమా వాయిదా.. ఈ సినిమా ముందుకు.. మరో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా నిన్న ‘నా పేరు సూర్య’ సినిమా ఏప్రిల్ 13కు ప్రిపోన్ అయిందని.. 27న ‘భరత్ అను నేను’ వస్తుందని.. ‘2.0’ సంగతేంటని డిస్కషన్లు జరిగాయి. కానీ ఒక రోజు తిరిగేసరికి ‘నా పేరు సూర్య’ టీం భిన్నమైన ప్రకటన ఇచ్చింది. ఈ వార్తలన్నీ అబద్ధమని తమ సినిమా ఏప్రిల్ 27కే పక్కగా వస్తుందని ప్రకటించింది. మరోవైపు ‘భరత్ అను నేను’ టీం డేట్ చెప్పట్లేదు కానీ.. ఏప్రిల్లోనే రిలీజ్ పక్కా అంటోంది. ఇంకోవైపు చివరగా రజినీకాంత్ మాట్లాడినపుడు ‘2.0’ ఏప్రిల్ 14న వస్తుందన్నాడు. దీంతో పక్కాగా ఏది ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయంలో పడిపోయారు జనాలు. మరి ఈ గందరగోళం.. ఈ సస్పెన్స్ ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.