Begin typing your search above and press return to search.
పేట్ట సస్పెన్స్ వీడలేదు
By: Tupaki Desk | 24 Dec 2018 8:21 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘పేట్ట’ తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. కొన్ని రోజుల ముందు వరకు ఈ చిత్రం సంక్రాంతికి తెలుగులో రాదనే అభిప్రాయంతో ఉన్నారంతా. అప్పటికి ఎవరూ తెలుగు వెర్షన్ హక్కులు తీసుకోలేదు. డబ్బింగ్ పనులు కూడా మొదలుపెట్టలేదు. కానీ ఉన్నట్లుండి సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ రంగంలోకి దిగి ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులు కొనేశాడు. డబ్బింగ్ పనులు మొదలుపెట్టేశాడు. సంక్రాంతికే ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఈ చిత్రానికి ఆయన థియేటర్లు ఎలా సర్దుబాటు చేస్తాడన్నదే అర్థం కావడం లేదు. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో ‘యన్.టి.ఆర్’.. ‘వినయ విధేయ రామ’.. ‘ఎఫ్-2’.. ఈ మూడు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు చేయడమే కష్టంగా ఉంది. ఇక ‘పేట్ట’కు ఎలా అడ్జస్ట్ చేస్తారో మరి.
ఐతే సి.కళ్యాణ్ మాత్రం తన పాటికి తాను ‘పేట్ట’ డబ్బింగ్ పనులు కొనసాగిస్తున్నారట. థియేటర్ల కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడట. ఐతే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కాకుండా ఇంతకుముందు టాలీవుడ్ నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని ముందుకు తెచ్చి ‘పేట్ట’ను పండక్కి రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. మరీ కష్టమైతే ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే వీకెండ్ కు వాయిదా వేయాలని చూస్తున్నాడట కళ్యాణ్. కానీ అప్పటికి ‘మిస్టర్ మజ్ను’ను షెడ్యూల్ చేసి పెట్టుకున్న సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్.. అడ్డం పడుతున్నారట. అఖిల్ మీదికి రజనీ సినిమాను వదిలితే చూస్తూ ఊరుకోనంటున్నారట. ఆ వారాంతానికి కళ్యాణ్ రామ్ ‘118’.. నిఖిల్ ‘ముద్ర’ చిత్రాల్ని కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రజనీ సినిమా వస్తే వీటన్నింటికీ ఇబ్బందే. ఈ పరిస్థితుల్లో ‘పేట్ట’ పరిస్థితి ఏమవుతుందన్నది అర్థం కావడం లేదు.