Begin typing your search above and press return to search.

అప్పుడు ఫ్రెండ్‌ అంది.. ఇప్పుడు...

By:  Tupaki Desk   |   16 Sep 2015 1:30 PM GMT
అప్పుడు ఫ్రెండ్‌ అంది.. ఇప్పుడు...
X
హ్రితిక్ రోషన్ మాజీ భార్య పెళ్లికి రెడీ అవుతోంది. 13 ఏళ్లపాటు కలిసి కాపురం చేసిన హ్రితిక్ - సుసానే ఖాన్ లు గతేడాది చట్టబద్ధంగా విడిపోయారు. 2000వ సంవత్సరం డిసెంబర్ లో ఇష్టపడి వివాహం చేసుకున్నా హ్రితిక్ - సుసానేలు. 2013వరకూ వీరి దాంపత్య జీవితంగా బాగానే సాగింది. అప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ... 2014మే నెలలో పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేశారు. గతేడాది నవంబర్ లో కోర్టు వీరిద్దరికీ డైవోర్స్ మంజూరు చేసింది. ఇద్దరు పిల్లలు ఉన్న ఈ జంట చట్టబద్ధంగా విడిపోయారు.

అప్పట్లో ఎందుకు విడిపోతున్నారో హ్రితిక్ కానీ, సుసానే కానీ నోరు విప్పలేదు ఇప్పుడీ విడాకులకు కారణాలు తెలుస్తున్నాయి. హ్రితిక్ రోషన్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరిని పెళ్లి చేసుకునేందుకు సుసానే రెడీ అవుతోందిట. అసలు విడాకులకు కారణం కూడా ఇతనే అని సమాచారం. ఇతని కారణంగా దంపతుల మధ్య విబేధాలు తలెత్తడంతో.. విడిపోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. హీరో అర్జున్ రాంపాల్ ని సుసానే పెళ్లి చేసుకోనుందనే వార్తలు వచ్చినా.. వీటిని రాంపాల్ ఖండించాడు. హ్రితిక్ ఫ్యామిలీకి దగ్గరి స్నేహితుడు రాంపాల్. ఇప్పుడు మాత్రం సుసానే పెళ్లి ఖాయం కానుందని, త్వరలో వివరాలు వెల్లడించనున్నారని తెలుస్తోంది. కాకపోతే అప్పట్లో సుసానే కూడా అర్జున్‌ ఓ మాంచి ఫ్రెండ్‌ అనే చెప్పింది. మరి ఇప్పుడిలా... ఏంటో..

ఇన్ని లవ్ స్టోరీల్లో చేసిన హ్రితిక్.. తన ఇంట్లోనే ఇంత పెద్ద స్టోరీ నడవడాన్ని తట్టుకోలేకపోయి ఉంటాడని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ - హ్రితిక్ రోషన్ ల మధ్య అనుబంధం పెళ్లికి దారి తీయనుందనే వార్తలు వస్తున్నా.. వీటిని ఎవరూ ఖండించలేదు, అలాగని కన్ ఫాం కూడా చేయలేదు.