Begin typing your search above and press return to search.
హృతిక్ వర్సెస్ కంగన..ఈ ఫ్యామిలీ గొడవలు తీర్చేదెలా?
By: Tupaki Desk | 24 April 2020 4:15 AM GMTక్వీన్ కంగన సోదరి రంగోలి చందేల్ నోటి దురుసుపై ప్రత్యర్థులు ఓ రేంజులో విరుచుకుపడుతుంటారు. హృతిక్ రోషన్- రాకేష్ రోషన్ బృందంపై ఎప్పటికప్పుడు తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడే కంగన- రంగోలి సిస్టర్స్ ఇప్పటికీ ఆ కుటుంబంపై కోర్టుల్లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిరంతరం ట్విట్టర్ వేదికగా కంగన తరపున రంగోలి వకాల్తా పుచ్చుకుని ప్రత్యర్థుల్ని చెడామడా తిట్టేస్తుండడం చూస్తున్నదే.
తాజాగా ఓ ట్వీట్ లో రంగోలి కాస్త కటువైన పదజాలాన్ని ఉపయోగించడంతో అది కాస్తా సంచలనమైంది. ఓ ట్వీట్ లో `నాజీలు` అంటూ పేర్కొంటూ ప్రత్యర్థుల్ని తిట్టేందుకు ప్రయత్నించింది. మూలాస్.. ఒక వర్గానికి సపోర్టుగా నిలిచే సెక్యులర్ మీడియా అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించింది. దీంతో రంగోలి వ్యవహారంపై సీరియస్ అయిన ట్విట్టర్ ప్రతినిధులు తన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయడం వేడెక్కించింది. అయితే రంగోలి చేసిన పనిని సమర్థిస్తూ కంగన ఇచ్చిన స్టేట్ మెంట్ అటుపై వైరల్ గా మారింది.
దీంతో హృతిక్ మాజీ భార్యామణి సుశానే ఖాన్ సోదరి డిజైనర్ ఫరా ఖాన్ అలీ సీన్ లోకి ఎంటరై రంగోలి వ్యవహారాన్ని తూర్పారబట్టింది. రంగోలి చందేల్ ను ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కంగన డిపెండ్ చేయడం సరికాదని విరుచుకుపడింది. రంగోలి ట్వీట్ ను ప్రత్యేకించి మార్కర్ తో ఎత్తి చూపడం ద్వారా తన వ్యవహారాన్ని తప్పు పట్టింది. తనకు రంగోలిపై వ్యక్తిగతంగా కోపం ఏమీ లేదని.. సోషల్ మీడియాలో తప్పిదాల్ని ఇలా `ఉదాహరణ ద్వారా ఖండించాను` అంటూ ఎత్తి చూపే ప్రయత్నం చేసింది. ఇక ఫరా రాసిన నోట్ కు నెటిజనులు అండగా నిలిచారు. రంగోలి ప్రస్థావించిన నాజీలు.. మూలాస్ వంటి పదాల్ని హైలైట్ చేయడం సరైనదేనని నెటిజనుల నుంచి మద్ధతు లభించింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా.. బాలీవుడ్ గాయని కరాలిసా మాంటెరో కూడా సోషల్ మీడియా వేదికపై తమ స్పందనల ద్వారా ఫరా వాదనలకు మద్దతునిచ్చారు. తాజా రచ్చతో హృతిక్ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. హృతిక్ వర్సెస్ కంగన .. ఫ్యామిలీ గొడవల్ని తీర్చేదెలా? అంటూ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.