Begin typing your search above and press return to search.
మాజీ భర్త ఇంటికి చేరింది
By: Tupaki Desk | 12 May 2020 7:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు ఆయన భార్య సుసానే ఖాన్ లు కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే మళ్లీ కలిశారు. పిల్లల కోసం అంటూ తరచు కలిస్తూనే ఉంటున్న హృతిక్ రోషన్ మరియు సుసానే ప్రస్తుతం ఒకే చోట ఉంటున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్ ఇంటికి సుసానే ఖాన్ చేరింది. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ కలవడంపై రకరకాలుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుసానే ఖాన్ స్పందించింది.
హృతిక్ రోషన్ ఇంటికి వెళ్లిన కారణం చెబుతూ.. పిల్లల కోసం తాము ఇద్దరం కూడా మొదటి నుండి కలిసే ఉండాలని భావించాం. అనుకున్నట్లుగానే మేము ఇద్దరం కూడా ఈ సమయంలో కలిసి ఉండాలనుకున్నాం. ఈ సమయంలో ఇద్దరు పిల్లలకు తమ అవసరం చాలా ఉంది. మేము ప్రస్తుతం కలిసి ఉండటంను తెలివైన మరియు మనోహరమైన చర్యగా అభివర్ణించింది.
ప్రేమతో లాక్ డౌన్ ను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో మేము కలిసి ఉంటున్నాం. పిల్లల కోసం మొదటి నుండి కూడా వీళ్లు కలిసే ఉంటున్నారు. మళ్లీ వీరు పెళ్లి చేసుకుంటారనే కూడా ప్రచారం జరిగింది. కాని పెళ్లి విషయాన్ని కొట్టి పారేశారు. కలిసి ఉంటున్న వీళ్లు మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.