Begin typing your search above and press return to search.
మాజీ భర్త సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పింది!
By: Tupaki Desk | 22 Dec 2016 1:30 PM GMTసరిగ్గా గమనిస్తే... విడాకులు తీసుకున్న తర్వాత కూడా చాలా మంది స్టార్స్ భార్యలు వారి వారి భర్తలపై సదాభిప్రాయాన్ని కలిగిఉండటమే కాకుండా వారి మంచిని కూడా నిత్యం కోరుతూనే ఉంటారు. ఈ విషయంలో టాలీవుడ్ లో కూడా విడాకులు తీసుకున్న హీరోల భార్యలు వారి వారి భర్తల గురించి నిత్యం సోషల్ మీడియా వేదికగానో, మీడియాలోనో స్పందిస్తూ, వారి క్షేమం కోరుతూ ఉంటారు. ఇదే క్రమంలో విడాకులు తీసుకున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ భార్య సుజానే అతనికి అండగా నిలిచే విషయంలో ఎప్పుడూ ముందుంటూనే ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటికే పలు సందర్భాల్లో.. ముఖ్యంగా కంగానా - హృతిక్ మధ్య నడిచిన గొడవలో హృతిక్ కు అండగా నిలిచిన సుజానె.. తాజాగా "కాబిల్" సినిమా విషయంలోనూ హృతిక్ కి మద్దతు పలికింది.
మొహెంజోదరు సినిమా ప్లాప్ తర్వాత హృతిక్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం "కాబిల్". ఈ సినిమా గురించి ముంబైలో తనకొచ్చిన చార్ కోల్ డిజైన్ ప్రాజెక్టుకు సంబందించిన అవార్డు అందుకునే సమయంలో సుజానె స్పందించారు. ఈ సినిమా గురించి అడగ్గానే తనదైన చిరునవ్వు చిందించిన సుజానె... "ఆల్ ద బెస్ట్.. ఈ సినిమా బాగా ఆడుతుందనే నమ్మకం నాకుంది" అని స్పందించింది.
కాగా, సుమారు 17 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్తూ 2013లో హృతిక్ - సుజానె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడాకుల అనంతరం కూడా ఈ జంట అప్పుడప్పుడు డిన్నర్ పార్టీలలో పిల్లలతో కలిసి స్నేహపూర్వకంగా ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు రెహాన్, రిధాన్ ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/