Begin typing your search above and press return to search.
'మా' కు ఎస్వీకే రాజీనామా చేశారా?
By: Tupaki Desk | 17 April 2019 4:04 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో అంతర్గత కలహాల గురించి తెలిసిందే. కొత్త అధ్యక్షుడు నరేష్ .. ఇతర కమిటీ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. కొత్త కమిటీ ఏర్పాటై ఎంతో కాలం కానేలేదు. ఇంతలోనే వరుస వివాదాలు మీడియాకెక్కడం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రమాణ స్వీకారాలు చేసిన రోజునే కొత్త కమిటీలో కలహాలు బయటపడడం ఆశ్చర్యపరిచింది.
నిన్నటిరోజున `మా` నిధుల్లో వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై గొడవ బయటపడింది. ఆ వివాదంపై మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ వివరణ ఇచ్చారు. ప్రతిదీ నియమనిబంధనల ప్రకారమే చేశామని వెల్లడించారు. అయితే ఈ వివాదాలేవీ ఇతర సభ్యులకు నచ్చడం లేదట. తాజా సమాచారం ప్రకారం.. `మా` ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు - సీనియర్ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.
`మా`లో వరుస వివాదాలు ఎస్వీకే పునరాలోచించుకునేలా చేశాయిట. అందుకే ఆయన రాజీనామా చేశారని ఆర్టిస్టుల్లో ముచ్చట సాగుతోంది. కలహాల కాపురం అవసరం లేదనుకునే ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. అయితే ఈ గొడవలన్నిటినీ సద్ధుమణిగేలా చేయాలంటే త్వరలోనే జనరల్ బాడీ మీటింగ్ లో ఇలాంటివన్నీ చర్చించుకోవాలని అధ్యక్షకార్యదర్శులు భావిస్తున్నారట. నరేష్ ప్రస్తుతం షూటింగులతో బిజీగా ఉన్నారు. తూ.గో జిల్లాలో షూటింగ్ జరుగుతోంది. ఆయన రాగానే జనరల్ బాడీ మీటింగ్ లేదా ఈసీ మీటింగ్ పెట్టుకుని అన్నిటినీ పరిష్కరించుకునేలా సమాలోచన చేస్తారని తెలుస్తోంది. ఎస్వీకే రాజీనామా గురించి ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.