Begin typing your search above and press return to search.
SVP బిజినెస్ లెక్క ఇది..మరి బాక్సాఫీస్ మాటేంటి?
By: Tupaki Desk | 9 May 2022 7:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా నటించిన 'సర్కారు వారి పాట' ఈనెల 12న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పక్కా కమర్శియల్ పైసా వసూల్ చిత్రమని టీజర్..ట్రైలర్..పోస్టర్లని బట్టి తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం ఇదే విషయాన్ని మహేష్..దర్శకుడు పరశురాం చెప్పుకొచ్చారు. ఈవెంట్కి అతిథులుగా విచ్చేసిన అనీల్ రావిపూడి..సుకుమార్..వంశీ పైడిపల్లి లాంటి మేకర్స్ సైతం మాస్ ని మెప్పించే సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేసారు.
ఇలా ఇన్ని పాజిటివ్ వైబ్ నడుమ ఎస్ వీపీ రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. థియేట్రికలర్ రైట్స్ 125 కోట్లకు అమ్మడుపోయింది. దాదాపు అన్ని ఏరియాల్లో సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ర్టాల్లోనే 100 కోట్ల బిజినెస్ జరగగా..మిగతా ఏరియాల్లో 25 కోట్లు వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది.
ఓసారి ఆ వివరాలు చూస్తే నైజాం- 36 కోట్లు..సీడెడ్-13 కోట్లు..వైజాగ్-13 కోట్లు పలకగా..మిగతా ప్రాంతాలన్ని కలిపి 36 కోట్లు బిజినెస్ జరిగిందని సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ర్టాల్లో 100 కోట్ల బిజినెస్ జరిగింది. కర్ణాటక 8.5 కోట్లు.. ఓవర్సీస్ 11 కోట్లు జరిగింది. దీంతో సర్కారు టార్గెట్ 125 కోట్ల షేర్ గా తెలుస్తుంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 125 కోట్లు షేర్ తప్పక రాబట్టాల్సిందే.
మహేష్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈ వసూళ్లు పెద్ద లెక్కేం కాదు. మూడు..నాలుగు రోజుల్లోనే సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. మహేష్ గత సినిమాలు మూడు వరుసగా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను'.. 'మహర్షి'..'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి.
అదే ఊపులో తాజా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల పరంగా ఢోకా ఉండదు. 'సరిలేరు నీకెవ్వరు' ఇప్పటివకూ మహేష్ కెరీర్ లోనే భారీగా వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 260 కోట్ల వసూళ్లతో మహేష్ గత రికార్డులు అన్నింటిని సరిలేరు తుడిచి పెట్టేసింది. ఈ సినిమా రికార్డుల్ని సైతం చెరిపేయాలని ఆ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి ప్రీ రిలీజ్ వేడుకలో ఆశించిన సంగతి తెలిసిందే.