Begin typing your search above and press return to search.
SVP : మరోసారి ఆ పని చేసిన కీర్తి సురేష్
By: Tupaki Desk | 2 May 2022 9:30 AM GMTమహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు సినిమా వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. కరోనా వల్ల చాలా ఆలస్యంగా ఆయన సినిమా విడుదల కాబోతుంది. దాంతో అభిమానులు చాలా ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. మొదటి సారి మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ కలిసి నటిస్తుండటంతో అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఇద్దరికి సరి జోడి అన్నట్లుగా ఉన్నారంటూ సినీ ప్రేమికుల కామెంట్స్ దక్కించుకుంది.
ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కథకు కీలకంగా ఉంటుందని పలు ఇంటర్వ్యూల్లో దర్శకుడు చెప్పుకొచ్చాడు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా కీర్తి సురేష్ తో ఈ సినిమా కోసం ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. గతంలో కీర్తి సురేష్ అజ్ఞాతవాసి సినిమాతో పాటు ఒకటి రెండు సినిమాలకు మాత్రమే డబ్బింగ్ చెప్పింది. తెలుగు లో ఈమద్య కాలంలో బాగానే మాట్లాడుతున్న కీర్తి సురేష్ తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో దాదాపు అందరు కూడా ఇతర భాషలకు చెందిన వారే అవ్వడం వల్ల డబ్బింగ్ చెప్పడం సమస్యగా మారుతుంది.ఒక్కరు ఇద్దరు తప్ప డబ్బింగ్ ను చెప్పుకునే హీరోయిన్స్ లేరు. అయితే ఈమద్య కాలంలో కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పేందుకు సిద్దం అయ్యింది. తన నటించిన పాత్రకు తానే డబ్బింగ్ చెప్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో కీర్తి సురేష్ ఈమద్య వరుసగా డబ్బింగ్ చెప్తోంది.
రాబోయే రోజుల్లో మరింత మంది హీరోయిన్స్ కూడా తెలుగు నేర్చుకుని వారి పాత్రలకు వారు డబ్బింగ్ చెప్పాలని.. కీర్తి సురేష్ ను ఆదర్శంగా తీసుకుని డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కీర్తి సురేష్ డబ్బింగ్ తో సినిమా లో ఆమె పాత్ర వెయిట్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 12వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలకు అంతా సిద్దం చేశారు. ట్రైలర్ లో కీర్తి సురేష్ వాయిస్ ఉంటుందని.. అందుకే ఆమె పాత్రకు ట్రైలర్ విడుదలకు ముందు డబ్బింగ్ చెప్పించినట్లుగా సమాచారం అందుతోంది. మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజర్స్ ద్వారా తెలుస్తోంది.