Begin typing your search above and press return to search.
ఎస్వీఆర్ కి కూడా టెన్షన్ తప్పలేదాయే!
By: Tupaki Desk | 23 Jun 2021 1:30 AM GMTఎస్వీ రంగారావు .. తెలుగు తెరతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు తెలియకుండా ఉండదు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే శ్రీరాముడు .. శ్రీకృష్ణుడు వంటి దేవుళ్ల రూపాలు ఎలా గుర్తుకువస్తాయో, ఎస్వీఆర్ పేరు చెప్పగానే రావణుడు .. కంసుడు .. హిరణ్యకశిపుడు .. కీచకుడు .. ఘటోత్కచుడు వంటి రాక్షస పాత్రలు కళ్లముందు కదలాడతాయి. ఆ పాత్రల్లో ఆయన ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యచకితుకులను చేస్తుంది .. ఆయనను అభినందించకుండా ఉండటం అసాధ్యమనిపిస్తుంది.
ఎస్వీఆర్ కి మొదటి నుంచి కూడా నటనపట్ల ఆసక్తి ఉండేది. అందువల్లనే ఆయన ఉద్యోగాలపై మనసు పెట్టలేకపోయారు. ఏ ఉద్యోగం చేస్తున్నా, మనసు మాత్రం సినిమాలపైనే ఉండేది. అందువల్లనే ఆయన ఉద్యోగం మానేసి మరీ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆరంభంలో ఆయన చేసిన సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఆయనకి కెరియర్ కి ఆశ కలిగించిన సినిమా ఏదైనా ఉందంటే, అది 'షావుకారు' మాత్రమే. ఈ సినిమాలో ఆయన పోషించిన 'సున్నపు రంగడు' పాత్ర, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత ఆయనకి 'పాతాళభైరవి' సినిమాలో మాంత్రికుడి వేషం లభించింది. నాగిరెడ్డి నిర్మాణంలో .. చక్రపాణి పర్యవేక్షణలో .. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమాలో మాంత్రికుడి వేషం చాలా కీలకమైనదని తెలిసి, ఆ పాత్రను అప్పుడప్పుడే పైకి వస్తున్న ఎస్వీఆర్ కి ఇవ్వడం కరెక్ట్ కాదని దర్శక నిర్మాతల దగ్గర సన్నిహితులు వ్యక్తం చేశారట. ఈ విషయం తెలిసి .. తనకి వచ్చిన ఒక మంచి అవకాశం ఎక్కడ జారిపోతుందోనని ఎస్వీఆర్ టెన్షన్ పడ్డారట. ఆయనపై గల నమ్మకంతో దర్శక నిర్మాతలు సన్నిహితుల మాటలు పట్టించుకోలేదు. 'పాతాళభైరవి' సినిమాలో మాంత్రికుడిగా ఎస్వీఆర్ ఏ స్థాయిలో తన విశ్వరూపం చూపించారో, ఆ తరువాత ఏ స్థాయిలో దూసుకుపోయారో అందరికీ తెలిసిందే.