Begin typing your search above and press return to search.
వీడియో టాక్: స్వాగ్ అంటూ సెగలు రేపేశారు
By: Tupaki Desk | 21 Nov 2017 5:26 PM GMTబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టైగర్ జిందా హై. కత్రినా కైఫ్ తో కలిసి సల్మాన్ మరోసారి యాక్షన్ అడ్వెంచర్ చూపించబోతున్నాడనే సంగతి ఇప్పటికే చెప్పేశారు. రెండు వారాల క్రితం రిలీజ్ అయిన టైగర్ జిందా హై ట్రైలర్ ఇప్పటివరకూ 42మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది.
ఇప్పుడీ మూవీ నుంచి వీడియో సాంగ్ ను విడుదల చేస్తామని చెప్పిన యూనిట్.. చెప్పినట్లుగానే 'స్వాగ్ సే కరేంగే సబ్ కా స్వాగత్ ' అంటూ సాగే పాటను విడుదల చేశారు. పాటను పూర్తిగా చూపించకపోయినా.. ఈ పాట ఏ రేంజ్ లో ఉండబోతోందనే సంగతి మాత్రం క్లియర్ గా చెప్పేసింది నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్. సల్లూ భాయ్ ఎప్పటి మాదిరిగానే తన స్టైల్ స్టెప్పులతో అలరించగా.. సల్మాన్ స్టెప్స్ నే మరింతగా ఇంప్రూవ్ చేసి తన డ్యాన్సింగ్ ట్యాలెంట్ అంతా చూపించేసింది కత్రినా కైఫ్.
లొకేషన్స్ నుంచి కత్రినా అందాల వరకూ.. సల్మాన్ మేనరిజమ్స్ నుంచి స్టైలింగ్ వరకూ ప్రతీ ఫ్రేమ్ ఇరగదీసేశారని చెప్పాల్సిందే. టైగర్ జిందా హై మూవీపై అంచనాలను పెంచడంలో స్వాగ్ సే స్వాగత్ సాంగ్ మరింతగా సక్సెస్ అయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే.. సల్మాన్-కేట్ ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. డిసెంబర్ 22న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం.. బాలీవుడ్ రికార్డులను తిరగరాస్తుందనే అంచనాలు ఉన్నాయి.