Begin typing your search above and press return to search.
మహానటిలో ఎన్నో సర్ ప్రైజ్ లు ఉన్నాయి
By: Tupaki Desk | 2 May 2018 4:14 AM GMTసావిత్రి ఎంత గొప్ప నటో ముందు తరం వాళ్లందరికీ తెలుసు. ఆమె జీవిత కథతో సినిమా వచ్చిందని తెలిస్తే ఆమె గురించి తెలిసిన వాళ్లంతా సినిమా చూస్తారు. అది అతి నమ్మకం కాదు. ఆత్మవిశ్వాసమే. ఈతరం వాళ్లు తెలుసుకోవాలి. అందుకోసమే మహానటి సినిమా నిర్మించామన్నారు ఈ సినిమా ప్రొడ్యూసర్ స్వప్నాదత్. సావిత్రి జీవితగాథతో మహానటి సినిమా తీయడం వెనుక నేపథ్యాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. మహానటి ఆడియో లాంచ్ ఈవెంట్లో ఈ సినిమా తీయడం వెనుక తాము పడిన శ్రమను వివరించి చెప్పారు.
‘‘ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు మమ్మల్ని చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. ఎందుకు సావిత్రి జీవిత గాథ తీయాలని అనుకుంటున్నారు? సెన్సేషన్ కోసమా.. వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారా.. ఇలా చాలా ప్రశ్నలే వచ్చాయి. ఎవడే సుబ్రహ్మణ్యం తరవాత డైరెక్టర్ నాగిని తరవాత ప్రాజెక్టు ఏంటని అడిగినప్పుడు ఈ సినిమా గురించి చెప్పాడు. అప్పుడు వర్కవుట్ అవుతుందా లేదా కూడా తెలీదు. నాగిపై ఉన్న నమ్మకంతో ముందుకెళ్లాం. మాకు జెన్యూన్ గా అనిపించింది ఒక్కటే. ఈ ఇండస్ట్రీలో 45 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడే ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. వైజయంతి బ్యానర్ కు ఒక గౌరవాన్ని తీసుకురావాలని అనుకున్నాం. అందుకే మహానటిని మీ ముందుకు తెస్తున్నాం.’’ అంటూ స్వప్నా ఉద్వేగంగా మాట్లాడారు.
‘‘ఈ సినిమా ఈ రోజు పూర్తయింది అంటే.. మేమంతా ఇలా మాట్లాడగలుగుతున్నాం అంటే 100 మందికి పైగా టెక్నీషియన్లు పడిన కష్టం. ఈ సినిమాని మొదట నమ్మి వచ్చింది సమంత. ఒక హై పొజిషన్ లో ఉన్న హీరోయిన్ ఇంకో హీరోయిన్ కథ చెప్పే క్యారెక్టర్ చేయడమంటే గట్స్ ఉండాలి. సమంతకు గట్స్ ఉన్నాయి. ఆల్రెడీ సూపర్ స్టార్ అయిన దుల్కర్ ఎప్పుడూ మాకు సహకరిస్తూనే వచ్చాడు. హీ ఈజ్ ఈ ఆబ్ సెల్యూట్ జెంటిల్ మేన్. మూడేళ్ల క్రితం ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అంత కష్టపడ్డాడు. ఈ సినిమాలో చాలా కామియో రోల్స్ ఉన్నాయి. అవెవరు చేశారు ఏంటి అనేది చెప్పను. అవి చూసేవాళ్లకి సర్ ప్రైజ్ గా ఉంటాయి’’ అంటూ ఈ సినిమాపై స్వప్నాదత్ అంచనాలు మరింత పెంచేశారు.