Begin typing your search above and press return to search.
అడల్ట్ ట్రోలింగ్.. మెచ్యూర్డ్ గా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
By: Tupaki Desk | 30 April 2019 9:13 AM GMTఏదైనా ఒక సినిమాలో ఒక డైలాగు సూపర్ గా క్లిక్ అయిందనేది ఎప్పుడు తెలుస్తున్దంటే ఆ వాటిని జనాలు రెగ్యులర్ లైఫ్ లో వాడినప్పుడే. అలాగే ఒక సీన్ సూపర్ గా క్లిక్ అయిందనేది దానిపై వచ్చే మీమ్స్ ను బట్టే తెలుస్తుంది. ఒక్కోసారి పరమచెత్త సీన్స్ కూడా ట్రోలింగ్ కు గురవుతాయి లెండి. కానీ మన టాపిక్ మాత్రం క్లిక్ అయిన సీన్స్ గురించే. అలాంటి ఒక సీన్ కు సంబంధించి తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ కు ట్రోలర్ల హీటు గట్టిగా తగిలింది.
ఇది ఎలెక్షన్స్ సీజన్ కదా. ఓటు వేయమని అందరూ కోరతారు. మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి అని జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ ఈ ప్రచారాన్నే కాస్త అడల్ట్ టచ్ తో చేపట్టారు కొంతమంది ట్రోలర్లు. "ఈ ఎలెక్షన్బ్ లో స్వర భాస్కర్ లాగా ఉండొద్దు. మీ వేలిని తెలివిగా ఉపయోగించండి" అంటూ కొందరు ప్లకార్డులు పట్టుకొని అడల్ట్ ఓటర్లకు అవగాహన కల్పించారు. ఇంతకీ విషయం ఏంటంటే.. కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన 'వీరె ది వెడ్డింగ్' సినిమాలో స్వర భాస్కర్ నటించింది. అదో అడల్ట్ టచ్ ఉండే మోడరన్ ఫిలిం. ఆ సినిమాలో స్వర భాస్కర్ ఒక స్వయం తృప్తి సీన్ లో నటించింది... నటించడం అనేది చిన్నమాట.. జీవించింది. అప్పటి నుంచి స్వర భాస్కర్ పాపులారిటీ డబల్.. ట్రిపుల్ అయింది. ఆ సీన్ ను ఉద్దేశించే ఈ ట్రోలర్లు వేలిని స్వర భాస్కర్ లాగా కాకుండా తెలివిగా వాడండి అని సెటైర్ లు వేశారు.
అసలే అడల్ట్ సీన్.. దానిపై అడల్ట్ ట్రోలింగ్.. అంతా బాగానే ఉంది. అందరిలాగానే ఊరుకుంటే స్వర భాస్కర్ స్పెషాలిటీ ఏముంది? సదరు ట్రోలర్ల ప్లకార్డు పట్టుకొని ఉన్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసి "ట్రోలర్లు మళ్ళీ ఇలా ఎండలో నిలబడి నన్ను పాపులర్ చేసేందుకు చాలా కష్టపడుతున్నారు. మీరు చాలా స్వీట్.. చాలా డెడికేషన్ ఉంది. నన్ను కించపరచడాన్ని నేనేమీ పట్టించుకోవడం లేదు. మీ తెలివి అంతే అనుకుంటాను... కానీ మీ ఇద్దరి కష్టానికి మాత్రం జోహార్లు" అంటూ లౌక్యంగా గట్టి సెటైర్ వేసింది.
స్వర వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ట్రోలర్లు ప్రవర్తించినప్పటికీ స్వర మాత్రం సంయమనం కోల్పోకుండా సూపర్ పంచ్ ఇవ్వడంతో నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విమర్శలను.. ట్రోలింగ్ ను ఎలా హ్యాండిల్ చేయాలో స్వరను చూసి నేర్చుకోవాల్సిందేనని తీర్మానిస్తున్నారు.