Begin typing your search above and press return to search.
మొదటి వారమే డైరెక్టర్ సెక్స్ కబుర్లు
By: Tupaki Desk | 7 Nov 2017 10:07 AM GMTఅవకాశం ఇచ్చేందుకు క్యాస్టింగ్ కౌచ్ కల్చర్ ఎలా ఉంటుందో.. ఓ సారి అవకాశం ఇచ్చాక ఆయా హీరోయిన్స్ ను లైంగికంగా వేధింపులకు గురి చేయడం అనే విషయం కూడా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈ విషయంపై నోరు మెదిపేందుకు ఎక్కువ మంది సాహసించరు.
ఒకవేళ అంతో ఇంతో మాట్లాడినా.. అసలు వ్యక్తి అనే విషయం తప్ప మిగిలిన కబుర్లు అన్నీ చెబుతారు. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ రీసెంట్ గా ఇలాంటి విషయాలనే చెప్పింది. ఒ దర్శకుడు తనను బాగా హరాస్ చేశాడని చెబుతున్న ఆమె.. టెక్ట్స్ మెసేజ్ ల ద్వారాను.. డిన్నర్ కి పిలవడం వంటివి చేయడం ద్వారా.. తెగ విసిగించాడని అంటోంది. 'షూటింగ్ ప్రారంభమైన తొలి వారం నుంచే ఆ దర్శకుడి నుంచి వేధింపులు మొదలయ్యాయి. నిజానికి ఆ డైరెక్టర్ గురించి నేను ముందే కొంత విన్నా కానీ.. మరీ ఇంత ఓపెన్ గా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. నేను ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దృష్టికి తీసుకెళ్లి తగిన రక్షణ పొందాను' అని చెబుతోంది స్వర భాస్కర్.
అంతా బాగానే ఉంది కానీ.. ఇంతకీ నిన్ను ఇంతగా వేధింపులకు గురి చేసిన ఆ దర్శకుడి పేరు ఏంటి అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అడక్కు అన్న టైపులో తప్పించుకుంది స్వర భాస్కర్. అన్నీ చెప్పి ఈ ఒక్క విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారో ఈ భామలు?