Begin typing your search above and press return to search.
ఒక్కసారి అలాంటి సీన్ చేస్తే ఆడుకుంటున్నారు.. నటి ఆవేదన
By: Tupaki Desk | 23 Aug 2021 3:30 PM GMTస్వరా భాస్కర్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లందరికీ ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద పోస్టులు పెడుతుంటారు. వివిధ సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందించే తత్వం నటి స్వర భాస్కర్ ది. ఇండస్ట్రీలో జరిగే చర్చల మీద అయినా.. సామాజిక అంశాల మీద అయినా ఆమె డేర్ గా స్పందిస్తూ ఉంటుంది.
తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతూ చెప్పగల నటి ఈమె. ఇలాంటి వారే కొన్ని పార్టీల వారికి కొన్ని రాజకీయ భావజాలాలు ఉన్న వారికి టార్గెట్ అవుతుంటారు. తమతో రాజకీయంగా విభేదిస్తూ పోస్టులు పెట్టే సెలబ్రెటీలను వివిధ రకాలుగా టార్గెట్ చేసుకోవడం కొందరు నెటిజన్లకు అలవాటు. ఇప్పుడు స్వరభాస్కర్ పై వీరందరూ పడ్డారు.
కొద్దిరోజుల క్రితం నటి స్వర భాస్కర్ నటించిన ‘వీర్ దే వెడ్డింగ్’ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో స్వరా నటించిన ఓ సీన్ చాలా పెద్ద వివాదాన్ని సృష్టించింది. అందుకు కారణం ఆ సీన్ లో ఆమె స్వయంతృప్తి పొందేందుకు చేసిన ఓ చర్యనే. సాధారణంగా మగవారు స్వయంతృప్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే నటి స్వర భాస్కర్ ఆ సీన్ ను సినిమాలో చేయడంతో ఆమెపై విమర్శల వర్షం కురుస్తోంది.
నెటిజన్లు ఇప్పుడు స్వర భాస్కర్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ స్వయం తృప్తి సీన్ ను హైలెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై నటి స్వరా తీవ్రంగా స్పందించింది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె మాట్లాడుతూ.. ‘ప్రతిరోజు ట్రోల్స్ ను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందని’ పేర్కొన్నారు. అయితే తనపై ఎలాంటి మాటలు వస్తాయో తాను కూడా అలాగే రిప్లై ఇస్తాను అని ఆమె స్పష్టం చేశారు. రోజు మంచిగా ఉంటే ప్రవర్తన కూడా మంచిగా ఉంటుందని.. లేకుంటే ప్రవర్తన కూడా దారుణంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
తాజాగా నెటిజన్ల ట్రోలింగ్ పై ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఓ పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో రోడ్డు, రెస్టారెంట్ లాగా ఓ పబ్లిక్ ప్లేస్ అని స్వరా పేర్కొంది. కానీ ఆఫ్ లైన్ లో ప్రజల్లో ఉండే మంచితనం ఆన్ లైన్ లో మాత్రం మాయం అయిపోతుందని చెప్పింది. ‘నేను ఒక పువ్వు ఫొటో పెట్టినా దాన్ని వీర్ దే వెడ్డింగ్ సినిమాలోని ఆ సీన్ కు జత చేసి కామెంట్స్ చేస్తున్నారని.. ఇది సైబర్ సెక్సువల్ హింస అని.. నేను చాలా స్ట్రాంగ్.. ఆన్ లైన్ లో జరిగే వాటికి నేను లొంగిపోను.. వర్చువల్ పబ్లిక్ ప్లేసులో ఇలాంటి ద్వేషం, ఉన్మాదం, బెదిరింపులకు మనం అడ్డుకట్ట వేయలేము అంటూ ఆమె పోస్టులో తెలిపింది.