Begin typing your search above and press return to search.

ముంబై నుండి ఢిల్లీలోని తల్లిని చేరిన నటి..!

By:  Tupaki Desk   |   21 May 2020 3:38 PM GMT
ముంబై నుండి ఢిల్లీలోని తల్లిని చేరిన నటి..!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. వ‌చ్చిన వాళ్లంతా స్టార్స్ కావ‌డం కష్టం. అవ‌కాశం వ‌చ్చిన‌పుడే ఉప‌యోగించుకోవాలి. ఇప్పుడు స్వ‌ర‌భాస్క‌ర్ కూడా ఇదే ప‌నిమీదుంది. ప్ర‌స్తుతం ఈ భామ పేరు బాలీవుడ్లో బాగానే వినిపిస్తుంది. దానికి కార‌ణం వీరి ది వెడ్డింగ్ చిత్రం. అందులో సోన‌మ్ క‌పూర్, క‌రీనా క‌పూర్ లాంటి స్టార్స్ ఉన్నా కూడా స్వ‌ర‌భాస్క‌ర్ కూడా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ అయింది.

ప్రస్తుతం స్వర భాస్కర్ తల్లి ఇరా భాస్కర్ ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతవారం ఆమె భుజానికి తీవ్ర గాయమై రెస్ట్ తీసుకుంటుందట. తల్లికి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొన్న స్వర వెంటనే ఢిల్లీకి వెళ్లాలని అనుకుందట.

కానీ లాక్‌డౌన్ నిబంధనల వలన చేసేదేమీ లేక ఫోనులోనే తల్లిని పరామర్శించింది. ఇటీవలే లాక్‌డౌన్‌ సడలింపు జరగడంతో అధికారుల వద్ద అనుమతులు తీసుకొని వెంటనే కారులో ఢిల్లీకి బయలు దేరింది. సుమారు 1400 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేసి చివరకు ఏదోలా బుధవారం ఢిల్లీకి చేరుకుంది. వెంటనే ఇంటికి చేరుకొని తల్లిని చూసి ఉద్వేగానికి లోనయ్యింది. గాయం గురించి అడిగి తెలుసుకొని ఊపిరి పీల్చుకుంది. ఇక ముంబై నుంచి ఢిల్లీకి చేరిన స్వరభాస్కర్‌కు ఢిల్లీ అధికారులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకొని క్వారంటైన్ లో ఉండాలని అధికారులు చెప్పారు. దీనికి స్వర భాస్కర్ అంగీకరించి.. నిబంధనలు పాటిస్తూ క్వారంటైన్‌లో ఉంటానని.. అలాగే నా తల్లి ఆరోగ్యాన్ని చూసుకుంటూ.. మరో 14 రోజులు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటానని స్వర భాస్కర్ తెలిపింది. తల్లి మీద మమకారం ఆమెను అలా రప్పించిందని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.