Begin typing your search above and press return to search.

నా తండ్రిని లాగొద్దు..బోల్డ్‌ సీన్స్‌ పై స్వర భాస్కర్‌

By:  Tupaki Desk   |   12 Sep 2018 4:59 PM GMT
నా తండ్రిని లాగొద్దు..బోల్డ్‌ సీన్స్‌ పై స్వర భాస్కర్‌
X
బాలీవుడ్‌ లో కొన్ని నెలల క్రితం విడుదలైన ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందే ఈ చిత్రం పలు వివాదాలను ఎదుర్కొంది. విడుదలైన తర్వాత కూడా సినిమాలోని పలు బోల్డ్‌ సీన్స్‌ కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా నటించిన కరీనా కపూర్‌ - సోనమ్‌ కపూర్‌ - స్వర భాస్కర్‌ లు చాలా బోల్డ్‌ గా నటించారు. అయితే అందరిలోకి స్వర భాస్కర్‌ పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ ఎక్కువ వచ్చాయి.

‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో స్వర భాస్కర్‌ చేసిన మాస్టర్బెషన్‌ సీన్‌ రచ్చ చేసిన విషయం తెల్సిందే. ఆ సీన్‌ పై నెటిజన్స్‌ ఏ స్థాయిలో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విమర్శలను ధీటుగానే ఎదుర్కొంది స్వర భాస్కర్‌. ఇప్పుడిప్పుడే ఆ విషయమై కుదుట పడుతున్న సమయంలో మళ్లీ ఆమెకు ఒక నెటిజన్‌ షాక్‌ ఇచ్చాడు. నేవీ ఆఫసర్‌ అయిన స్వర భాస్కర్‌ తండ్రి ఇటీవల ట్విట్టర్‌ లో ఒక పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ కు ఒక వ్యక్తి స్వర భాస్కర్‌ మాస్టర్బెషన్‌ ఫొటోను కామెంట్‌ గా పెట్టాడు. దానికి తోడు ఈమె ఎవరు, ఆమె ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించాడు.

సదరు నెటిజన్‌ చేసిన పనికి స్వర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం ఏమాత్రం పద్దతి కాదని, ఆ విషయాన్ని తన తండ్రిని అడగాల్సింది కాదని, సినిమా కోసం తాను అలా చేశాను తప్ప మరో ఉద్దేశ్యం లేదు అనే విషయం అందరికి తొసు. కాని నువ్వు దిగజారి ప్రవర్తించావు. నీకు ఏదైనా సమాధానం కావాల్సి ఉంటే నన్ను అడగాల్సింది అంటూ పోస్ట్‌ చేసింది. స్వరకు ఎంతో మంది మద్దతుగా నిలుస్తున్నారు.