Begin typing your search above and press return to search.
రేప్ లపై జోక్ లు వేసేవాళ్లు తస్మాత్ జాగ్రత్త!
By: Tupaki Desk | 27 Sep 2019 7:14 AM GMTభారతదేశంలో మహిళల రక్షణ అనేది పెను సమస్యలా మారింది. సంఘంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్లు .... ప్రజలు ఎన్నుకున్నవాళ్లు అత్యాచారాల్లోనో.. హత్యాచారాల్లోనో నేరస్తులుగా ఉంటున్నారు.
ఇప్పటికే ఉన్నావో .. చిన్మయానంద్ కేసులో ఈ సంగతి బట్టబయలైంది. ఈ కేసుల్లో పెద్దోళ్లకు ఎదురెళ్లి రేప్ కి గురయ్యామని చెప్పిన బాధితులు చాలా సీరియస్ సమస్యలు ఎదుర్కొన్నారు. నాయకుల వల్ల అత్యాచారానికి గురయ్యామని బయటకు చెప్పినందుకు బాధితులే చిక్కుల్లో పడ్డారు. ఇది మన సమాజానికి ఒక మేలుకోవాల్సిన తరుణం. మన చట్టాల్ని తయారు చేసిన వాళ్లంతా మహిళా భద్రత గురించి మరింతగా ఆలోచించాల్సిన టైమ్ వచ్చింది.
ఉత్తరప్రదేశ్ ఉన్నావో కేసులో ఆ బాధితురాలు కిడ్నాప్ కి గురవ్వడమే కాదు.. రేప్ కి గురైంది. అది చేసినది భారతీయ జనతా పార్టీ కుల్ దీప్ సింగ్ సెంగర్ . 2017లో జరిగింది ఈ ఘటన. ఎవరైతే బాధితులు ఉన్నారో కిడ్నాప్ అత్యాచారానికి గురయ్యాక మళ్లీ యాక్సిడెంట్ కి గురైంది. దిల్లీకి చెందిన ఏఐఐఎంఎస్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నుంచి రెండునెలలు చికిత్స పొంది నిన్ననే(గురువారం) డిశ్చార్జి అయ్యింది. ఇప్పుడూ తన కుటుంబ సభ్యులు సొంత ఊరు వెళ్లాలంటేనే చాలా భయపడుతున్నారు. అత్యాచారానికి గురైన ఆవిడ కుటుంబ సభ్యులు చాలా భయంతో ఉన్నారు. సేఫ్టీ లేదని ఆవేదన చెందుతున్నారు.
ఒక లాయర్ చదివే విద్యార్థిని భాజపా నాయకుడిపై ఆరోపించాక ... ఎక్స్ టార్షన్.. బ్లాక్ మెయిల్ అంటూ ఆరోపిస్తూ రివర్సు కేసులు వేసి లోనేశారు. అందుకు కాపాడాల్సిన పోలీసులే సాయం చేశారు. షాజహాన్ పూర్ కి చెందిన ఓ విద్యార్థిని కూడా మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ స్వామి చిన్మయానంద్ (73) తనని రేప్ చేశాడని ఆరోపించింది. ఆ తర్వాత తనకు కూడా చిక్కులు తప్పలేదు.
ఈ రెండు ఉదంతాలపై బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ తన వాయిస్ ని రైజ్ చేసింది. ఈ బాధితులంతా ఘోర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చిన్మయానంద్ వల్ల రేప్ కి గురైన బాధితురాలి(లా విద్యార్థిని)ని అరెస్ట్ చేశారు... అంటూ ఆవేదనను స్వరా వ్యక్తం చేసింది. అయితే స్వరాభాస్కర్ తన అభిప్రాయం చెప్పగానే చాలామంది నెటిజనులు దానికి వెకిలిగా ట్రోల్ చేశారు. నువ్వు కూడా రేప్ కి గురయ్యావా?! అంటూ ఒక నెటిజన్ స్మైల్ ఈమోజీని పోస్ట్ చేశాడు. అయితే దానికి స్వరా చాలా సీరియస్ గా రియాక్టయ్యారు.