Begin typing your search above and press return to search.

తనుశ్రీ ఎపిసోడ్ లో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది!

By:  Tupaki Desk   |   5 Oct 2018 12:00 PM IST
తనుశ్రీ ఎపిసోడ్ లో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది!
X
తనుశ్రీ దత్తా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. 2008 లో 'హార్న్‌ ఓకే ప్లీజ్‌' సినిమా షూటింగ్ సమయంలో నానా తనను లైంగికంగా వేధించారని... ఆసమయంలో ప్రతిఘటించినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ ఎస్‌) కార్యకర్తలు తనను బెదిరించారని.. అప్పట్లో తనపై దాడి కూడా జరిగిందని ఆరోపణలు చేసింది. ఇక బాలీవుడ్ లో కొంతమంది సెలబ్రిటీలు తనుశ్రీకి మద్దతుగా నిలిచారు.

కానీ కొంతమంది మాత్రం తనుశ్రీ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందని విమర్శించారు. కొందరు మాత్రం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమె టార్గెట్ అని కూడా అన్నారు. ఇక ఈ విషయంలో ఎంఎన్‌ ఎస్‌ కార్యకర్తలు హిందీ వెర్షన్ బిగ్ బాస్ నిర్వాహకులను తనుశ్రీ ని హౌస్ లోకి తీసుకున్న పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారని వార్తలు వచ్చాయి. ఇక ఎంఎన్‌ ఎస్‌ కార్యకర్తలు లోనావలా లోని బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి అక్కడి నిర్వాహకులను తనుశ్రీని తీసుకోవద్దని బెదిరించి ఒక లేఖ అందజేశారని.. ఆసమయంలో వారితో నిర్వాహకులు దిగిన ఫోటో మీడియాలో వచ్చింది.

ఇక ఈ విషయంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఎంఎన్‌ ఎస్‌ కార్యకర్తలపై మండిపడింది. "ఏంటి.. ఇదేమన్నా జోకా? అంటే మనం ఈ దౌర్జన్యాలను.. గూండాగిరీ చేసే వాళ్లను అలా వదిలేయాలంటారా? అయినా విధ్వంసం సృష్టిస్తామని బెదిరిస్తున్న అటువంటి గూండాలతో ఫొటో దిగడానికి ఎవరు ఇష్టపడతారు. మనందరికీ ఏమయ్యింది?" అంటూ ట్వీట్ చేసింది. రోజుకో మలుపు తిరుగుతున్న తనుశ్రీ ఎపిసోడ్లో మరెన్నిట్విస్ట్ లు వస్తాయో వేచి చూడాలి.