Begin typing your search above and press return to search.

ముద్దు కోసం ట్రై చేశాడట

By:  Tupaki Desk   |   30 Jun 2018 4:21 AM GMT
ముద్దు కోసం ట్రై చేశాడట
X
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా క్యాస్టింగ్ కౌచ్ కి సంబందించిన ఎదో ఒక మ్యాటర్ వైరల్ అవుతూనే ఉంది. హీరోయిన్స్ ఇంటర్వ్యూలు ఇస్తే చాలు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు చాలా ఎదురవుతున్నాయి. అయితే చాలా వరకు హీరోయిన్స్ కూడా వాటికి వారి స్టైల్ లోనే సమాధానం చెబుతున్నారు. ఇక రీసెంట్ గా వీరే ది వెడ్డింగ్ సినిమాలో అందరిని పిచ్చెక్కించిన స్వర భాస్కర్ కూడా ఆ విషయంపై ఒక వివరణ ఇచ్చింది.

క్యాస్టింగ్ కౌచ్ అనే దానికి ఎవరైనా వ్యతిరేకమే. నా దగ్గర అలాంటి ప్రస్తావన వస్తే వెంటనే నో చేప్పేస్తా. ఒకసారి ఒక క్యాస్ట్ మేనేజర్ వ్యక్తి నన్ను ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. నేను అది గమనించి అతన్ని నెట్టేశాను. క్యాస్టింగ్ కౌచ్ అనే విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవసరం అయితే అప్పుడే కౌంటర్ ఇచ్చేయ్యాలి. మన సమస్యలను మనమే ఎదుర్కోవాలని మెస్సేజ్ ఇచ్చింది. అంతే కాకుండా క్యాస్టింగ్ కౌచ్ లో ఎవరు డైరెక్ట్ గా అడగరు అని చెబుతూ.. కొన్ని సిగ్నల్స్ ఇస్తారు మనం కూడా అలానే కౌంటర్ ఇచ్చేయాలని తన స్టోరీ చెప్పుకుంది.

ఇక అమ్మడు వీరే ధీ వెడ్డింగ్ లో హాట్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి వసూళ్లతో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో అమ్మడితో సినిమాలు చేయడానికి కొంత మంది బడా దర్శకులు శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.