Begin typing your search above and press return to search.
కలర్స్ స్వాతి ఇలా మారిపోయిందేంటో
By: Tupaki Desk | 25 Jan 2016 6:43 AM GMTబుల్లితెరపై నుంచి వచ్చి వెండితెరపై సత్తా చాటి, సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగిన ఏకైక భామ కలర్స్ స్వాతి. ఒక తెలుగమ్మాయి హీరోయిన్ అవడమే కష్టం అనుకుంటున్న సమయంలో పదేళ్లకుపై కంటిన్యూ చేయగలగడం, స్వాతి రెడ్డి ట్యాలెంట్ కి నిదర్శనం. అయితే, గతేడాది ఈమెకి పెద్దగా కలిసి రాలేదు. తనే ప్రధాన పాత్రలే నటించిన త్రిపురపై ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ చిన్నది. అయితే, ఆ మూవీ మూడు భాషల్లో రిలీజ్ అయినా, ఎక్కడా కనీస స్థాయి వసూళ్లు కూడా సాధించలేకపోయింది.
త్రిపుర మూవీలో స్వాతి లుక్ పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మామూలుగానే ఈమెది స్మైలీ ఫేస్. దీనికి తోడు బాగా బొద్దుగా ఉండడంతో.. స్వాతి ఎంతగా భయపెడదామన్నా, అంతా కామెడీ అయిపోయింది. చివరకు మూవీ కూడా అలాగే తయారైంది. ఆ తర్వాత కలర్స్ పాప జనాల కంటికి కనిపించడమే మానేసింది. త్రిపుర రిలీజ్ అయి ఇప్పటికి రెండున్నర నెలలు గడవగా.. ఈ మధ్యలో ఏ ఫంక్షన్ కి అటెండ్ కాలేదు.
కానీ ఇప్పుడు హఠాత్తుగా ఐఐఎఫ్ఏ 2016 అవార్డ్ ఫంక్షన్ లో దర్శనమిచ్చింది. బొద్దుగా, సంప్రదాయంగా కనిపించే ఈ చిన్నది, సన్నగా స్టన్నింగ్ లుక్ తో కనిపించేసరికి అందరూ షాక్ తిన్నారు. దీనికి తోడు మోడ్రన్ లుక్ కూడా అడిషనల్ గ్లామర్ తెచ్చిపెట్టింది. అసలు ఇంత తక్కువ టైంలో ఇంత సన్నగా మారిపోవడానికి కారణం ఏంటో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. మీరేమన్నా గెస్ చేస్తారా?