Begin typing your search above and press return to search.

ఈ బాడీతో బికినీయా?? -స్వాతి

By:  Tupaki Desk   |   7 Nov 2015 5:30 PM GMT
ఈ బాడీతో బికినీయా?? -స్వాతి
X
కలర్స్ స్వాతి.. పదేళ్లుగా సినీ రంగంలో హీరోయిన్ గా వెలుగుతున్నా.. ఈ తెలుగు పిల్లను ఇంకా టీవీలో కనిపించిన పేరుతోనే జనాలు పిలుచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం అప్పుడు కనిపించిన లుక్ తోనే ఇంకా కంటిన్యూ అవడం. సాధారణంగా ఇలా ఒకే లుక్ ని, ట్రెండ్ ని హీరోయిన్లు కంటిన్యూ చేయడం చాలా అరుదుగా జరిగే సంఘటన.

పదేళ్లపాటు కెరీర్ కొనసాగినా.. స్వాతికి స్టార్ స్టేటస్ రాలేదు. దీనికి రీజన్ ఈజీగానే దొరుకుతుంది. స్వాతి ఇప్పటికీ గ్లామర్ గా కనిపించాలని తాపత్రయపడలేదు. కనీసం చిన్నపాటి ఎక్స్ పోజింగ్ కూడా చేయలేదు. కేవలం తన పెర్ఫామెన్స్ తోనే ఇన్నేళ్లపాటు ఇండస్ట్రీ ఉంది. చాలా మంది ఈ చిన్నదాన్ని దూరం పెట్టడానికి ఇదే రీజన్ అని ఒప్పుకోవాలి.

''నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు ఉన్నది ఒకే లైఫ్. దాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. తినడం మానేసి.. జిమ్ కి వెళ్లి బాడీ మెయింటెయిన్ చేస్తే.. స్టార్ హీరోయిన్ కావచ్చేమో. అందుకోసం నోరు కట్టుకోవాలి. కానీ నా వల్ల కాదు'' అంటోంది స్వాతి.

'ఈ బాడీతో బికినీలు వేయడం సాధ్యం కాదని నాకు తెలుసు. కానీ సినిమాల్లో బికినీలు వేసి.. ఎక్కడికో వెళ్లి తలుపులు వేసుకుని బతికే టైప్ కాదు కదా. ఇక్కడే ఉండాలి. ఈ జనాల మధ్యలోనే తిరగాలి. అందుకే వాటి జోలికి వెళ్లలేదు ' అంటూ తనెందుకు గ్లామర్ గా కనిపించలేదో ఓపెన్ గా చెప్పేసింది స్వాతి. అసలు పదేళ్లపాటు కెరీర్ కొనసాగడానికి.. తన కమిట్ మెంటే కారణమంటోంది అమ్మడు.