Begin typing your search above and press return to search.
తాళి కట్టించుకుంటూ స్వాతి టెన్షన్
By: Tupaki Desk | 15 Sep 2015 10:30 PM GMTజీవితంలో పుట్టుక, పెళ్లి, చావు చాలా ముఖ్యమైన విషయాలు. ఐతే పుట్టుక, చావు రెండూ కూడా మనకు తెలియకుండా జరిగిపోతాయి. మనకు బాగా తెలిసి జరుగుతుంది కాబట్టి పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టంగా భావిస్తాం. ఐతే జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే (సాధారణంగా) ఈ వేడుక ఎవరికైనా ప్రత్యేకమే. పెళ్లి వాతావరణాన్ని అనుభూతి చెందడం.. పెళ్లి తంతులో పాల్గొనడం.. తాళి కట్టడం/కట్టించుకోవడం.. ఇలా పెళ్లిలో ప్రతి విషయమూ ప్రత్యేకమైందే. ఐతే మామూలు జనాలకు జీవితంలో ఇలాంటి అనుభవం ఒక్కసారే ఉంటుంది కానీ.. సినిమా వాళ్లకు మాత్రం చాలాసార్లు ఈ అనుభవం ఎదురవుతుంది. షూటింగులో భాగంగా డమ్మీ పెళ్లిళ్లు చాలానే జరిగిపోతుంటాయి.
పేరున్న నటీనటులు తమ కెరీర్ లో ఒక్కసారైనా పెళ్లి సీన్ లో నటించక మానరు. తాళి కట్టడమో, కట్టించుకోవడమో ఏదో ఒకటి చేయక తప్పరు. కొందరు ఈ సన్నివేశాన్ని లైట్ తీసుకుంటారు. ఇంకొందరు ఎగ్జైట్ అవుతారు. స్వాతి రెండో కేటగిరీలోకి చేరింది. తన కెరీర్ లో తొలిసారిగా ఆమె పెళ్లి కూతురిగా నటించే అవకాశం ఆమెకు ‘త్రిపుర’ సినిమాలో దక్కింది. ఈ సన్నివేశంలో చాలా టెన్షన్ పడిపోయానని అంటోంది స్వాతి. ‘‘జనాలు నిజంగా పెళ్లి చేసుకునే ధైర్యం ఎలా చేస్తారో? అది చాలా కంగారు పెట్టే విషయం. త్రిపుర షూటింగులో భాగంగా నవీన్ చంద్ర నాకు తాళి కడుతుంటే స్టన్ అయిపోయా. అదో చిత్రమైన అనుభవం. నా చుట్టూ ఉన్న జూనియర్ ఆర్టిస్టుల్లో మాత్రం నాకున్నంత ఎగ్జైట్ మెంట్ లేదు’’ అని చెప్పింది స్వాతి. పెళ్లి చేసుకోవాల్సిన రోజులు దగ్గర పడుతున్నాయో ఏమో స్వాతికి.. అందుకే పెళ్లి సీన్ విషయంలో ఇంత ఎగ్జైటైపోయినట్లుంది మరి.