Begin typing your search above and press return to search.
నా చీరపై ఎన్ని కామెంట్లు బాబోయ్
By: Tupaki Desk | 29 Aug 2015 7:24 AM GMTతెలుగమ్మాయ్ స్వాతి 'త్రిపుర'గా భయపెట్టేందుకు వస్తోంది. గీతాంజలి ఫేం రాజ్ కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో పాటు సేమ్ టైమ్ స్వాతి నటించిన ఓ మలయాళ చిత్రం రిలీజ్ కి వస్తోంది. ఈ సందర్భంగా స్వాతి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ముచ్చటించింది.
=నేను నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజవుతున్నాయి. ఇది ఆనందాన్నిచ్చేదే.
= త్రిపుర చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఇదో చక్కని హారర్ థ్రిల్లర్. నవీన్ చంద్ర హీరో. నా భర్తగా నటించాడు. నవీన్ డాక్టర్ పాత్రలో కనిపిస్తాడు.
=ఎవరు లీడ్ రోల్ చేశారు.. అన్నది అనవసరం. సినిమా చూస్తుంటే కేవలం పాత్రలు మాత్రమే కళ్లముందు కదులుతాయి. త్రిపురలో నేను చీరకట్టాను. ఇది వెరీ స్పెషల్.
= 16 ప్రాయం నుంచే చీర కడుతూనే ఉన్నా. మొదటిసారి కృష్ణ వంశీ దర్శకత్వంలోని 'డేంజర్' సినిమా కోసం చీరకట్టాను. మరీ స్కూలు పిల్లలా ఉన్నావే అన్నారు. ఆ తర్వాత మళ్లీ 'అష్టా చెమ్మా' కోసం చీరకట్టుకున్నా. స్కూల్లో టీచర్స్ డే ఫంక్షన్ కి వెళుతున్న టీచరమ్మలా ఉన్నావ్ అన్నారు. ఆ తర్వాత మరోసారి 'గోల్కొండ హైస్కూల్' సినిమా కోసం చీర కట్టుకున్నా. చాలా బాగున్నావ్ కానీ, కాస్త సన్నగా ఉన్నావే.. అన్నారు.
= అంటే నేను చీర కట్టిన ప్రతిసారీ కుర్రాళ్లు వంక పెడుతూనే ఉన్నారు. నాపైనా, నా చీరపైనా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. త్రిపురలో మాత్రం అలా వంక పెట్టడానికి అవకాశమే లేదు. అంత బావుంటుంది.. సుమీ అంటూ చాలా సంగతులే స్వాతి చెప్పింది.