Begin typing your search above and press return to search.

అంటే ఫీలవుతావ్‌ కాని స్వాతి...

By:  Tupaki Desk   |   23 Jun 2015 1:30 PM GMT
అంటే ఫీలవుతావ్‌ కాని స్వాతి...
X
మొన్న ఎవరో ఆన్‌లైన్‌లో ఆంటీ అనగానే రయ్‌ అంటూ ఎగసిపడింది స్వాతి. మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీని ఒకప్పుడు తెలుగు నాయికలే ఏలారు. కాని ఇప్పుడు మాత్రం తెలుగు భామలు కరువయ్యారు. ఉన్న అతికొద్దిమందిలో స్వాతి సూపరు. కాకపోతే తొలినుండీ గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉండటం వలన అమ్మడికి పెద్దగా బ్రేక్‌ రాలేదు. కాని ఈ మధ్యన కాస్త సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.. ఈ సమయంలో అమ్మడు ఓ మిస్టేక్‌ చేస్తోందని తెలుసుకోవట్లేదు మరి.

నిజానికి ఒక హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసినా చేయకపోయినా కూడా చూడటానికి స్లిమ్‌గా అందంగా కనిపించడం మాత్రం అవసరం. చేసే పాత్రలు ఏవైనా కూడా రోజూ జిమ్‌కు వెళ్ళి ఫిట్‌నెస్‌ మెయిన్‌టైన్‌ చేయడం అనేది ముఖ్యమే. అలా చెయ్యకపోతే చివరకు ఆర్తి అగర్వాల్‌ టైపులో తయారవుతారు. కాని స్వాతి మాత్రం ఆ విషయం గ్రహించకుండా తెగ ఫీలైపోతోంది. నన్ను ఆంటీ అంటావా అంటూ వెంటపడి తిడుతోంది కాని, ఆ వెయిట్‌ తగ్గించుకునే కృషి పెద్దగా చేయట్లేదని ఇట్టే చెప్పొచ్చు. కొత్తగా వచ్చిన త్రిపుర స్టిల్స్‌ చూడండి.. పెళ్లయిన ఓ సంవత్సరానికి ఆడపిల్లలు అలా వెయిట్‌ పెరిగిపోతారని అంటారు. కరెక్టుగా స్వాతి అలాగే పెరిగినట్లుంది. ఫీలవ్వడం పక్కనెట్టి ట్రెడ్‌ మిల్‌ ఎక్కు తల్లోయ్‌!!