Begin typing your search above and press return to search.

ఏం స్వాతిముత్యం మరీ ఇంత త్వరగానా.. ఆ రూల్‌ ఏమైంది?

By:  Tupaki Desk   |   20 Oct 2022 10:04 AM GMT
ఏం స్వాతిముత్యం మరీ ఇంత త్వరగానా.. ఆ రూల్‌ ఏమైంది?
X
బెల్లంకొండ సాయి గణేష్ మరియు వర్ష బొల్లమ్మ జంటగా సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో వచ్చిన స్వాతిముత్యం సినిమా పాజిటివ్‌ టాక్ ను దక్కించుకుంది కానీ ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వలేదు.

దసరాకు గాడ్‌ ఫాదర్ తో పాటు ఘోస్ట్‌ సినిమాలు విడుదల అయ్యాయి. అదే రోజు స్వాతిముత్యం కూడా విడుదల చేయడం వల్ల పాజిటివ్‌ టాక్ వచ్చినా కూడా వసూళ్లు నమోదు అవ్వలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల వారి మాట.

ఒక వైపు స్వాతిముత్యం సినిమా మొన్న మొన్నే వచ్చినట్లుగా ఉంది.. సోషల్‌ మీడియాలో ఇంకా కూడా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతోంది. అయినా అప్పుడే సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్వాతిముత్యం సినిమా వచ్చే వారంలో అంటే అక్టోబర్ 28వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నారట.

ప్రముఖ ఓటీటీ కాస్త ఎక్కువ మొత్తానికే ఈ సినిమాను కొనుగోలు చేసిందని.. అందుకే మూడు వారాలకే సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ మధ్య నిర్మాతల మండలి చర్చలు జరిపి నిర్మాతలు సినిమాలు విడుదల అయిన ఎనిమిది వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయవద్దంటూ నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెల్సిందే.

స్వాతిముత్యం సినిమా కు ఆ రూల్ వర్తించదా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఆ రూల్‌ క్రియేట్‌ అయ్యే సమయంకు ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది.. లేదా విడుదలకు సిద్ధంగా ఉండి ఒప్పందం కూడా చేసుకున్నారు.

కనుక ఆ రూల్‌ ఈ సినిమాకు వర్తించే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్వాతిముత్యం కచ్చితంగా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.