Begin typing your search above and press return to search.

‘స్వాతిముత్యం’కు 30 ఏళ్ళు

By:  Tupaki Desk   |   13 March 2016 4:05 AM GMT
‘స్వాతిముత్యం’కు 30 ఏళ్ళు
X
తెలుగు చలన చిత్ర చరిత్రలో కమల్ హాసన్ - రాధిక జంటగా నటించిన ‘స్వాతిముత్యం’ సినిమాకు ప్రత్యేక స్థానం వుంటుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ అద్భుత కళాఖండం అని చెప్పొచ్చు. అలాంటి సినిమా విడుదలై అప్పుడే ముప్పై ఏళ్లయింది. మార్చి 13, 1986లో ఈ చిత్రం విడుదలై.. కమర్షియల్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాదు.. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతిష్టాకరమైన ఆస్కార్ అవార్డు కి ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండటం స్వాతిముత్యం కే దక్కింది .

పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఈ చిత్రం అప్పట్లో జాతీయ అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులను గెలుచుకుంది. నంది అవార్డ్స్ లో బంగారు నందిని ఉత్తమ నటుడు... ఉత్తమ దర్శకుడు విభాగాల్లో అందుకున్నారు. అలాగే ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకుంది. రష్యన్ భాషలోకి అనువాదం కూడా చేశారు. అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. తమిళంలో సిప్పిక్కుల్ ముత్తుగా విజయ ఢంకా మ్రోగించింది. తెలుగులో 25 కేంద్రాల్లో 500 రోజులు ప్రదర్శించబడింది. కర్ణాటకలోనూ 500 రోజులకి పైగా ఆడిన ఏకైక చిత్రం ఇదే. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ హైలైట్. డాక్టర్ సి.నారాయణరెడ్డి - ఆత్రేయ - సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.