Begin typing your search above and press return to search.
స్వాతి నాయుడి వీడియోల గురించి భర్త ఏమన్నాడంటే..
By: Tupaki Desk | 15 March 2019 6:24 AM GMTస్వాతి నాయుడు.. ఇంటర్నెట్ లో శృంగార భరిత సినిమాలు చూసేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గతంలో సాఫ్ట్ పోర్న్ సినిమాలు చేసిన ఆమె.. ఈ మధ్య పూర్తి స్థాయి పోర్న్ సినిమాల్లో నటించింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓ సగటు అబ్బాయి ముందుకు రావడం కొంత ఆశ్చర్యమే. ఐతే కొంత కాలంగా స్వాతి తో ప్రేమలో ఉన్న అవినాష్ అనే అబ్బాయి ఆమెను ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఐతే స్వాతిని పెళ్లి చేసుకునే విషయంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అని అవినాష్ చెప్పాడు. ఇటీవల స్వాతితో కలిసి అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన కుటుంబ సభ్యులు స్వాతితో పెళ్లిని నిరాకరించారని.. వాళ్లు లేకుండా పెళ్లి జరగడం లోటే అని అతనన్నాడు. స్వాతి శృంగార చిత్రాల్లో నటించినందుకు తనకు అభ్యంతరం లేదని అవినాష్ చెప్పడం గమనార్హం.
‘‘అందరి లాగే మా పెళ్లి జరిగింది. మా కుటుంబం నా పెళ్లికి రాకపోవడం ఒక్కటే లోటుగా కనిపించింది. ఆమె నాకు నచ్చడానికి కారణం మేం ఇద్దరం మంచి ఫ్రెండ్స్. తరువాత రిలేషన్స్ లో ఉన్నాం. సొసైటీ ఏం అనుకున్నా పర్లేదు అనుకున్నా. స్వాతి నాయుడు గతం గురించి తెలిసి మా ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వాళ్లు లేకుండానే పెళ్లి చేసుకున్నాం. స్వాతి గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. ఆమె శృంగార వీడియోలు - రొమాంటిక్ వీడియోలు ఏం చేసినా.. కెమెరా ముందే చేస్తుంది. ముందొకటి వెనకొకటి చేయదు. స్వాతి మీద ప్రేమతో నా కుటుంబ సభ్యుల్ని కూడా వదిలేసుకున్నా. ఎవరో ఏదో అనుకుంటారంటే పట్టించుకోవడం వదిలేశా. తనేంటో నాకు తెలుసు. అర్ధం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి విషయంలో నా తమ్ముడు కూడా చివర్లో హ్యాండిచ్చాడు. పెళ్లి వరకూ నాతో బాగానే ఉన్నాడు తరువాత రివర్స్ అయ్యాడు. మా పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు చాలామంది ప్రయత్నించారు. నేను డబ్బుకి అసలు విలువ ఇవ్వను. తను నాకు కట్నం ఇస్తానన్నా వద్దనే చెప్పా’’ అని అవినాష్ అన్నాడు.