Begin typing your search above and press return to search.

స్వాతి.. కలరింగా? కవరింగా?

By:  Tupaki Desk   |   28 Nov 2017 5:30 PM GMT
స్వాతి.. కలరింగా? కవరింగా?
X
'లండన్ బాబులు' సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న తెలుగు పిల్ల స్వాతి రెడ్డి.. మరోసారి బ్యాడ్ లక్ చవిచూడక తప్పలేదు. అసలు మినిమం అంటే మినిమం కూడా ఆ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. తద్వారా ఈ కలర్స్ పిల్ల కూడా మరో ఫ్లాపును తన ఖాతాలో వేసుకున్నట్లైంది. అయితే ఈ సినిమా తరువాత కూడా తనకు స్టార్డమ్ రాదంటూ అమ్మడు ముందుగానే వేదాంతం చెప్పేసిందిలే.

''నాకో మైనస్ ఉంది. నన్ను నేను మార్కెట్ చేసుకోలేను. నేను బాగా లేజీ. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. అలా మార్కెట్ చేసుకోవడానికి బోలెడెంత ఖర్చు కూడా అవుతుంది. కాని ఆ ఖర్చంతా నేను షాప్ ఓపెనింగ్ చేసుకుని వసూలు చేసుకోవచ్చు గాని.. అప్పుడు వచ్చే డబ్బు ఖర్చు చేసే డబ్బు బ్యాలెన్స్ అవుతుంది. అదంతా ఎందుకసలు? పైగా పెద్ద సినిమాలు చేయాలంటే..వాళ్ళతో తిరిగి.. సెల్ఫీలు దిగి.. సోషల్ మీడియాలో పెట్టి.. అవన్నీ చేయాలి. నేను చేయలేదు. అందుకే కెరియర్ స్లో అయిపోయింది'' అని చెప్పుకొచ్చింది స్వాతి.

ఒక ప్రక్కన సక్సెస్ సింపుల్ గా రాలేదు అంటూనే.. మరో ప్రక్కన తనని తాను మార్కెట్ చేసుకోను అనడం.. కాస్త కలరింగ్ ఇచ్చే పనిలాగానే ఉంది. లేదంటే ఇన్నాళ్ళు చేసిన మిస్టేక్స్ ను కవరింగ్ చేసుకుంటోంది అనుకోవాలి. టాలెంటున్న తెలుగు పిల్లలు దొరకని ఈరోజుల్లో.. అన్నీ పుష్కలంగా ఉండా కూడా వేస్ట్ చేసుకోవడం అంటే.. స్వాతికే చెల్లింది.