Begin typing your search above and press return to search.
అది శుద్ధ అబద్ధం అంటున్న స్వాతి
By: Tupaki Desk | 6 Nov 2015 7:30 AM GMTస్వాతి గ్లామర్ రోల్స్ కు రెడీ అట.. ఇకపై ఆమెను ఇంకో యాంగిల్లో చూడొచ్చట.. రెండు మూడు రోజులుగా ఇదో పెద్ద టాపిక్ అయిపోయింది. ఇన్నాళ్లూ అంత పద్ధతిగా కనిపించి.. ఇప్పుడు స్వాతికి ఇదేం ఆలోచన అన్నవాళ్లున్నారు. స్వాతి పనైపోయిందనడానికి ఇందో ఇండికేషన్ అన్నవాళ్లూ ఉన్నారు. ఐతే ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ.. తనకైతే గ్లామరస్ గా - సెక్సీగా కనిపించే ఉద్దేశాలేమీ లేవంటోంది కలర్స్ పాప. గ్లామర్ రోల్స్ కు రెడీ అని తాను ఎక్కడా చెప్పలేదని.. కావాలనే ఎవరో రూమర్లు పుట్టించారని అంటోంది స్వాతి.
‘‘ఇంతకుముందు నా పెళ్లి గురించి ఎలా రూమర్లు పుట్టించారో.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేస్తా అన్నది కూడా అలాంటి పుకారే. నాకు అలాంటి ఉద్దేశాలేమీ లేవు. గ్లామర్ మరీ ఎక్కువైతే అలాంటి రోల్స్ నాకు సూటవ్వవని నా ఉద్దేశం. అలా నటించడానికి కూడా నేను ఇబ్బంది పడతాను. ఎవరు ఎలాంటి పాత్రలకు సూటవుతారో అలాంటి పాత్రలే చేయనివ్వండి. వాళ్లను ప్రోత్సహించండి. ఏదో ఒక ముద్ర వేసేసి ఇబ్బంది పెట్టకండి. నేను ఇలాంటి పాత్రలే చేయాలి అని ఫిక్సయిపోయి ఎప్పుడూ లేను. నా దగ్గరికి ఏ పాత్రలు వస్తే అవి చేశా’’ అని స్వాతి చెప్పింది.
సినిమాలు సెలెక్టివ్ గా చేయడం గురించి మాట్లాడుతూ.. తనకు స్టార్ హీరోయిన్ అయిపోవాలని, బోలెడంత డబ్బులు సంపాదించేయాలని లేదని.. తన మనసుకు నచ్చిన పాత్రలే చేశానని.. మలయాళంలో తాను తీసుకునే పారితోషకం చాలా తక్కువని.. ఖర్చులకే సరిపోతుందని.. అయినప్పటికీ అక్కడ సినిమాలు ఒప్పుకుంటున్నానంటే తన ప్రయారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చని.. గ్యాప్ దొరికినపుడు ఆ టైంని తల్లిదండ్రుల కోసం, సన్నిహితుల కోసం ఉపయోగిస్తానని.. అంతే తప్ప ఖాళీ అయిపోయానని బాధపడనని స్వాతి చెప్పింది.