Begin typing your search above and press return to search.
తల్లితో కలిసి ఉండనంటున్న స్వాతి
By: Tupaki Desk | 1 March 2016 8:04 AM GMTవర్ధమాన నటి స్వాతి రెడ్డికి సంబంధించిన వివాదం సమసిపోలేదు. ముందు తన తల్లి మీద ఆరోపణలు చేసి.. తర్వాత ఆమె ఏదో తొందరపడి అలా చేసిందని సర్దిచెబుతూ.. తాను తన తల్లితోనే కలిసి ఉండబోతున్నట్లు మీడియాకు వివరించిన స్వాతి రెడ్డి.. ఇప్పుడు కొత్త పల్లవి అందుకుంది. తనకు తన తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేదని తేల్చి చెప్పింది. డబ్బు విషయంలోనే తమ ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయని.. ఐతే తన తల్లి తొందరపాటు వల్లే ఇంత గొడవ జరిగిందని ఆమె వ్యాఖ్యానించింది. ఇక తన తండ్రి మరణంపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఆయన గుండెపోటుతోనే చనిపోయారని తనకు తెలుసని ఆమె చెప్పింది.
తన చిన్నతనం నుంచి తన తండ్రి తరఫు వాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవని.. ఇప్పుడు కొత్తగా తన తండ్రికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని స్వాతి రెడ్డి వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అన్ని వివాదాలూ సమసిపోయానని.. తానిక సినిమాల మీద దృష్టిపెడతానని స్వాతి చెప్పింది. ఇకపై ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా తన తల్లి కూడా దూరంగా, ఒంటరిగా ఉంటానని ఆమె తెలిపింది. తన కూతురును శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ ఐదు రోజుల కిందట స్వాతి రెడ్డి తల్లి నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఐతే వెంటనే స్వాతి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన తల్లితో గొడవకు దిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తితో తనకే సంబంధం లేదని.. అనవసరంగా దీన్ని పెద్ద వివాదం చేయొద్దని పేర్కొంది. స్టేషన్ లోనే మీడియా ముందు తల్లీ కూతుళ్లు గొడవ పడగా.. పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేసి పంపించారు. ఆ సమయంలో తల్లితో కాంప్రమైజ్ అయినట్లు కనిపించిన స్వాతి.. ఇప్పుడు తన తల్లికి దూరంగా ఉంటానంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.