Begin typing your search above and press return to search.

నిర్మాత కొడుకుతో పెళ్లిపై స్వాతిముత్యం బ్యూటీ సూపర్‌ రెస్పాన్స్‌

By:  Tupaki Desk   |   29 Oct 2022 7:30 AM GMT
నిర్మాత కొడుకుతో పెళ్లిపై స్వాతిముత్యం బ్యూటీ సూపర్‌ రెస్పాన్స్‌
X
స్వాతిముత్యం సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించి అందంతో పాటు అభినయం తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ వర్ష బొల్లమ్మ. పక్కింటి అమ్మాయి ఫీల్ కలిగిస్తున్న వర్ష తాజాగా స్వాతిముత్యం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది. బెల్లంకొండ సాయి గణేష్ కి సరి జోడీ అన్నట్లుగా నిలిచింది.

ఒక వైపు స్వాతిముత్యం సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్ష బిజీ బిజీగా ఉండగా మరో వైపు ఆమె పెళ్లి గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒక ప్రముఖ నిర్మాత తనయుడితో వర్ష వివాహం జరగబోతుంది అంటూ ప్రచారం మొదలు అయ్యింది. ఆ నిర్మాత ఎవరు అనేది మాత్రం ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు.

నిర్మాత కొడుకు మరియు వర్ష ఈ మధ్య ప్రేమలో పడ్డారని.. వారి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యుల నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని ప్రముఖంగా కథనాలు రావడంతో తాజాగా వర్ష సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ తనపై ఫేక్ వార్తలు రాసిన వారికి కౌంటర్ ఇచ్చింది.

నా కోసం నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసి ఒక అబ్బాయిని ఎంపిక చేసిన అన్ని వెబ్‌ సైట్స్ వారికి కృతజ్ఞతలు. ఆ అబ్బాయి ఎవరో అనే విషయం నాకు చెప్తే నేను మా ఇంట్లో వారికి చెప్తాను. ప్రస్తుతానికి అయితే నా పెళ్లి చూపులు చూడాలి అంటే ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న స్వాతిముత్యం సినిమాను చూడండి అంటూ తప్పుడు కథనాలకు భలే రెస్పాన్స్ ఇచ్చింది. వర్ష సమయస్ఫూర్తికి నిజంగా అభినందనలు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.