Begin typing your search above and press return to search.

బెల్లంకొండ `స్వాతిముత్యం` సంక్రాంతి ట్రీట్‌

By:  Tupaki Desk   |   15 Jan 2022 5:54 AM GMT
బెల్లంకొండ `స్వాతిముత్యం` సంక్రాంతి ట్రీట్‌
X
స్టార్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేష్ ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టికే బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వ‌రుస చిత్రాల‌తో బిజీగా వున్న బెల్లంకొండ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం `ఛ‌త్ర‌ప‌తి` రీమేక్ తో బాలీవుడ్ త‌లుపుత‌డుతున్నాడు. అంతే కాకుండా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా `స్టూవ‌ర్ట్ పురం దొంగ‌` పేరుతో రూపొందుతున్న బ‌యోప‌క్ లోనూ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ఈ బ‌యోపిక్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.

త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇదిలా వుంటే ఇదే ఫ్యామిలీ నుంచి మ‌రో వార‌సుడు తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గ‌ణేష్ ఇదే ఏడాది హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి `స్వాతిముత్యం` అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా ల‌క్ష్మ‌ణ్ కె. కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్ ని సంక్రాంతి సంద‌ర్భంగా మేక‌ర్స్ శ‌నివారం సాయంత్రం 4:05 నిమిషాల‌కు రిలీజ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. ఇందులో హీరో బెల్లంకొండ గ‌ణేష్, హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్మ క‌నిపిస్తున్నారు.

టైటిల్ కి త‌గ్గ‌ట్టే బెల్లంకొండ గ‌ణేష్ పోస్ట‌ర్‌లో `స్వాతిముత్యం`లానే క‌నిపిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ లో ఈ మూవీ టైటిల్ నిప్ర‌క‌టిస్తూ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసిన మేక‌ర్స్ మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అదే డ్రెస్ లో వున్న బెల్లంకొండ గ‌ణేష్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. ప్రేమ‌, పెళ్లి, జీవితం విష‌యంలో విభిన్న‌మైన ఆలోచ‌న‌లున్న ఓ యువ‌కుడి ప్ర‌యాణం నేప‌థ్యంలో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో బెల్లంకొండ గ‌ణేష్ బాల‌ముర‌ళిగానూ,, వ‌ర్ష బొల్ల‌మ్మ భాగ్య‌ల‌క్ష్మి గానూ క‌నిపించ‌బోతున్నారు. ఈ రోజు గ్లింప్స్ తో ఈ రోజు గ్లింప్స్ తో సంక్రాంతి ట్రీట్ ఇస్తున్నారు. గ్లింప్స్ ఎలా వుండనుంద‌న్న‌ది తెలియాలంటే ఈ రోజు సాయంత్రం 4:05 నిమిషాల వ‌ర‌కు వేచి చూడాల్సిందే.