Begin typing your search above and press return to search.

స్వాతితో ఎఫైరా? రూమరే

By:  Tupaki Desk   |   5 Aug 2017 11:30 PM GMT
స్వాతితో ఎఫైరా? రూమరే
X
మన ఫిలిం సర్కిల్స్ లో రెగ్యులర్ గా కొన్ని గాసిప్పులు వినిపిస్తూనే ఉంటాయి. ఎంత ఆపుదాం అని ట్రై చేసినా కూడా అవని ఆగవు. ఆ మధ్యన అసలు హీరోయిన్ కలర్స్ స్వాతి ఒక్క సినిమా కూడా చేయకపోవడంతో.. ఆమె పెళ్ళి చేసుకుంటుందని.. త్వరలోనే హీరో నిఖిల్ అండ్ స్వాతి వివాహమాడనున్నారని చాలా రూమర్లు వినిపించాయి. వీరిద్దరూ స్వామిరారా సినిమా చేసి తరువాత వెంటనే కార్తికేయ సినిమా చేశారు కాబట్టి.. ఈ రూమర్లు వచ్చేశాయిలే.

అయితే ఈ రూమర్లో అస్సలు నిజం లేదని తేల్చేశాడు నిఖిల్. ''నాకు స్వాతి మంచి ఫ్రెండ్ మాత్రమే. అస్సలు అటువంటివి ఏమీ లేవు. వాళ్లింట్లో ఇంకా స్వాతికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. తనకు ఖచ్చితంగా మంచి భర్త వస్తాడు. నాకంటే బెటర్ అయినావాడే దొరుకుతాడు'' అంటూ సెలవిచ్చాడు ఈ యంగ్ స్టార్. రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ఒక టివి కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాలను తేల్చేశాడు. ఈ సందర్బంగా హీరో రాజ్ తరుణ్‌ కూడా తనకు ఎవ్వరితోనూ ఎఫైర్లు లేవని చెప్పాశాడులే.

ఇప్పుడు చాలామంది హీరోలకు టివి షోల్లో పాల్గొనాలంటే మంచి జోష్‌ వస్తోంది. ఎందుకంటే తమ మీద వస్తున్న రూమర్లకు చాలామంచి క్లారిటీ ఇచ్చుకోవడానికి అదొక స్టేజ్ లా వారికి పనికొస్తోంది. పైగా ఎక్కువ టిఆర్పీలు ఉన్న షో లో అటువంటి క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుందని చెబుతున్నాడు నిఖిల్. మరి మిగతా హీరోలు హీరోయిన్లు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారేమో చూద్దాం.