Begin typing your search above and press return to search.
నాగార్జున గారు ఆ మాట అనడం చాలా బాధ కలిగించింది : స్వాతి దీక్షిత్
By: Tupaki Desk | 7 Oct 2020 1:34 PM GMTబిగ్ బాస్ నాల్గవ వారం తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ అతి తక్కువ సమయంలో ఎలిమినేట్ అయ్యింది. కేవలం ఆమె 9 రోజులకే బయటకు రావడం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది. స్వాతి ఎలిమినేషన్ అయ్యిందన్నప్పుడు అంతా కూడా షాక్ అయ్యారు. మరో వైపు ఏమైనా సీక్రెట్ టాస్క్ అయ్యి ఉంటుందని భావించారు. కాని అవన్ని ఏమీ లేదు. స్వాతి నిజంగానే ఎలిమినేట్ అయ్యింది. ఆ విషయాన్ని నేను కూడా నమ్మలేక పోతున్నాను. ఖచ్చితంగా నన్ను ఎలిమినేట్ చేయరు అనే మా ఇంటికి వెళ్లే వరకు కూడా అనుకున్నాను అంటూ తాజాగా టీవీ9 తో మాట్లాడిన సందర్బంగా స్వాతి చెప్పుకొచ్చింది.
టీవీ9 ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాకు సాధ్యం అయినంత వరకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నించాను. నేను చేసిన దాంట్లో కేవలం 5 శాతం మాత్రమే చూపించడం వల్ల నా గురించి ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది. అందుకే ప్రేక్షకులు నాకు ఓట్లు వేయలేదని నేను అనుకుంటున్నాను. నేను ఎలిమినేట్ అయిన తర్వాత నాగార్జున గారు హౌస్ లో గేమ్ ఆడేవారు మరియు ఎంటర్ టైన్ చేసేవారికి మాత్రమే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటుంది అన్నారు.
ఆయన మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎంటర్ టైన్ చేయలేదని ఎలా అంటారు. డాన్స్ చేశాను.. నవరసాల టాస్క్ లోనూ మరియు కాయిన్స్ టాస్క్ లోనూ నేను సాధ్యం అయినంత వరకు కష్టపడ్డాను. దెబ్బలు తగిలించుకుని బొటల వేలు ప్యాశ్చర్ అయినా కూడా పట్టించుకోకుండా గేమ్ ఆడాను. అలాంటిది నేను గేమ్ ఆడలేదు అనడం బాధ కలిగించింది. ఆ మాటలను ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో నాకు అర్థం కాలేదని స్వాతి దీక్షిత్ అన్నారు.